

హ హ్హ హాసినిగా జెనీలియా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ప్రభంజనమే ఈ సృష్టించింది ఈ బ్యూటీ. టాలీవుడ్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ మూవీలతో తెలుగు ప్రేక్షకుల అశేష ఆదరాభిమానాలను పొందిన నటి.

అలాంటి ముద్దుగుమ్మ బాలీవుడ్ నటుడు రితేష్‌ని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయినా..ఫ్యాషన్ పరంగా అంతే స్టైలిష్ ఉంటారామె. ఇప్పటికీ అంతే గ్లామర్‌తో తనదైన స్టన్నింగ్ లుక్‌తో ఆకట్టుకుంటారామె. అందులో హైలెట్‌గా నిలిచేవి ఆమె సెలెక్ట్ చేసుకునే డ్రెస్సింగ్ స్టైల్.

ఈసారి ఆమె శతాబ్దాల నాటి కళారూపమైన పెన్ కలంకారి లెహంగా దుప్పటలో తళుక్కుమంది.

ఇందులో ఉపయోగించిన రంగులన్నీ సహజసిద్ధమైనవట. ముఖ్యంగా ఆవు పేడ,పాలు వంటి సహజపదార్థాల ఫ్యాబ్రిక్ సమ్మేళనం

ఈ కలంకారి లెహంగా దుప్పట మొత్తం హస్త కళాకారుల చేతి నుంచి జాలు వారిన పేయింటింగ్. పూర్తి అవ్వడానికి సుమారు 25 రోజులు పైనే పట్టిందట.

జెనీలియా ఈ సంప్రదాయ లుక్‌ని వెండి ఆభరణాల అలంకరణతో హైలెట్ చేసింది.

పండుగ సీజన్‌లో కనిపించే సంప్రదాయ ఫ్యాషన్ లుక్‌కి సరైన నిర్వచనంగా జెనీలియా స్టైల్ అదుర్స్.




