
నంబర్ వన్ ఏరియా.. ఉత్పత్తిలో వెనుకంజ
గోదావరిఖని: సింగరేణిలోని ఏరియా పేరు నంబ ర్ – వన్‌గా ఉన్నా.. బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో వెనకపడుతోంది. మూడు భూగర్భగనులు, ఒక ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుతో ఆర్జీ –వన్ ఏరియా వార్షిక ఉత్పత్తి లక్ష్యం అందుకోలేకపోతోంది. 2025 – 26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 18.07లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి 15.94 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించింది. నిర్దేశిత లక్ష్య సాధనలో 88 శాతం నమోదు చేసింది.
మేడిపల్లి ఓసీపీ మూసివేత తర్వాత..
సింగరేణిలోనే ప్రత్యేక స్థానం ఉన్న ఆర్జీ–1 ఏరియాలో మేడిపల్లి ఓసీపీ మూతపడిన తర్వాత జీడీకే–5 ఓసీపీ ద్వారా లక్ష్య సాధనలో అగ్రగామిగా నిలుస్తోంది. ఓసీపీలో పూర్తిస్థాయిలో ఓవర్ బర్డెన్(మట్టి తవ్వకం)ను అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ద్వారా వెలికితీస్తోంది. కేవలం బొగ్గు ఉత్పత్తి మాత్రమే సింగరేణి ద్వారా కొనసాగుతోంది. ఈక్రమంలో ఓసీపీలో నిర్దేశిత లక్ష్యానికి మించి బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. మూడు భూగర్భ గనుల్లో మాత్రం లక్ష్యానికి అనుగుణంగా ఉత్పత్తి రావడం లేదు. గడిచిన మూడు నెలల్లో ఉత్పత్తి లక్ష్యం నిరాశాజనకంగా ఉంది. జూలై, ఆగస్టులో ఉత్పత్తి పూర్తిస్థాయిలో సాధించినా.. ఏప్రిల్, మే, జూన్‌లో ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది.
భూగర్భగనుల వెనకంజ
వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో ఆర్జీ–1 ఏరియాలోని భూగర్భ గనులు వెనుకంజలో ఉన్నాయి. జీడీకే–1,3 గని 78శాతం, జీడీకే–2,2ఏ గని 61శాతం, జీడీకే–11గని 61శాతం బొగ్గు ఉత్పత్తి సాధించాయి. మరోవైపు.. జీడీకే–5 ఓసీపీ భారీగా బొగ్గు ఉత్పత్తి సాధించి నిర్దేశిత లక్ష్యానికి మంచి.. 140శాతం బొగ్గు ఉత్పత్తి సాధించింది. భూగర్భగనుల్లో ఉత్పత్తి లక్ష్యం పెంచడంతోపాటు, జీడీకే–5 ఓసీపీలో అత్యధిక బొగ్గు ఉత్పత్తి సాధిస్తే రాబోయే రోజుల్లో లక్ష్యానికి అనుగుణంగా ముందుకు వెళ్లవచ్చని భావిస్తున్నారు.
2025–26 ఆర్థిక సంవత్సరం
బొగ్గు ఉత్పత్తి(టన్నుల్లో)
నెల లక్ష్యం సాధించింది శాతం
ఏప్రిల్ 4,06,400 2,06,439 51
మే 4,09,900 3,63,871 89
జూన్ 3,77,100 3,56,262 94
జూలై 3,20,900 3,33,925 104
ఆగస్ట్ 2,93,500 3,33,515 114
మొత్తం 18,07,800 15,94,012 88
రప్రణాళికతో ముందుకు..
వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్తున్నాం. గత ఆర్థిక సంవత్సరం సర్దుబా టుతో ఏప్రిల్‌లో ఉత్పత్తి ఆశాజనకంగా కనిపిస్తోంది. జీడీకే–11గనిలో కొత్త ప్యానెల్ ప్రిపరేటివ్ పనులతో ఉత్పత్తి తక్కు వగా వస్తోంది. ఉత్పత్తి పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ ఏడాది చివరి వరకు ఉత్పత్తి లక్ష్యం సాధించేందుకు ఉన్న అడ్డంకులు అధిగమిస్తాం. ఆర్థిక సంవత్సరంలో లక్ష్యానికి మించి బొగ్గు ఉత్పత్తి సాధిస్తాం.
– లలిత్‌కుమార్, జీఎం, సింగరేణి ఆర్జీ –1

నంబర్ వన్ ఏరియా.. ఉత్పత్తిలో వెనుకంజ

నంబర్ వన్ ఏరియా.. ఉత్పత్తిలో వెనుకంజ