
కట్టుదాటుతున్న ఖాకీలు
గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా డీజే నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసిన ఓ ఎస్సై.. అందులో ఒకరు ఆలస్యంగా రావడంతో ఆగ్రహించారు. ఆలస్యంగా ఎందుకు వచ్చావని చితకబాదడంతో బాధితుడు రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశాడు.
గోదావరిఖని గోదావరి వంతెన పైనుంచి నదిలోకి వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్న సింగరేణి క్రేన్ ఆపరేటర్ శ్రావణ్.. రెండురోజుల పాటు రాత్రివేళ పనులు చేయడంతో అలసిపోయాడు. ఈక్రమంలో క్రేన్ దిగివచ్చాడు. దీంతో ట్రాఫిక్ జామ్ అవుతోందని ఆగ్రహిస్తూ సీఐ.. సదరు ఆపరేటర్ ను దుర్భాషలాడుతూ చేయిచేసుకున్నారు.
గోదావరిఖని: ఖాకీలు కట్టుదాటుతున్నారు. ఉన్నతాధికారులు ఫ్రెండ్లీ పోలీసింగ్ పాటిస్తూ ఉంటే.. కొందరు పోలీస్ అధికారుల తొందరపాటు వారికి సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. సివిల్ వివాదాల్లో తలదూర్చవద్దని, హద్దుమీరొద్దని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తరచూ సూ చిస్తున్నా కొన్ని అనూహ్య ఘటనలు చోటుచేసు కోవడం వివాదాస్పదమవుతున్నాయి.
ఆలస్యంగా రావడమే నేరమా?
గణేశ్ ఉత్సవాల సందర్భంగా ఓ ఠాణాలో డీజే ని ర్వాహకులతో అక్కడి ఎస్సై సమావేశమయ్యారు. అంతవరకు బాగానే ఉన్నా.. ఒకరు ఆలస్యంగా రావడంతో.. ‘నేను చెప్పినా పట్టించుకోకుండా ఆలస్యంగా వచ్చావా’ అని ఎస్సై తన బెల్ట్‌తో డీజే ని ర్వాహకున్ని కొట్టినట్లు కమిషరేట్‌లో ఫిర్యాదు అందింది. ఎస్సైపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమో దు చేసి, స్వతంత్రంగా దర్యాప్తు చేయాలని కోరా రు. ఆదివారం వేకువజామున సింగరేణి క్రేన్ ఆపరేటర్ గండు శ్రావణ్‌కుమార్‌ను ఓ సీఐ దుర్బాషలాడుతూ చేయిచేసుకున్నారు. క్రేన్ ఆపివేయడంతో ట్రాఫిక్ జామ్ అవుతోందని సీఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండురోజులు రాత్రి విధులు నిర్వహించడంతో అలసిపోయానని బాధితుడు చెప్పినా పట్టించుకోకుండా సీఐ చేయిచేసుకున్నారని బాధితుడు వాపోయాడు. అంతేకాదు.. క్రేన్ ఆపరేటర్‌పై చేయిచేసుకున్న చెన్నూర్ రూరల్ సీఐ బన్సీలాల్‌పై చర్య తీసుకోవాలని సింగరేణి ఆర్జీ – వన్ జీఎం లలిత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు.
పోలీస్ కమిషనర్‌కూ ఫిర్యాదు..
క్రేన్ ఆపరేటర్‌పై చేయిచేసుకున్న సీఐపై చర్య తీసుకోవాలని కోరుతూ ఆర్జీ –వన్ జీఎం లలిత్‌కుమార్ రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝాకు ఫిర్యాదు చేశారు. రామగుండం మున్సిపల్ అధికారుల విన తి మేరకు 10 క్రేన్లను విగ్రహాల నిమజ్జనం కోసం కేటాయించామని, సుమారు 2వేల విగ్రహాలను ఆపరేటర్లు నిమజ్జనం చేశారని జీఎం తెలిపారు. ఈక్రమంలో జీడీకే–11గనిలో క్రేన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న గండు శ్రావణ్‌కుమార్‌పై సీఐ చేయి చేసుకున్నారని జీఎం తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పారిశ్రామిక సంబంధాల సమస్య తలెత్తకుండా సీఐపై చర్య తీసుకోవాలని జీఎం కోరారు.
ఠాణాలో డీసీపీ, ఏసీపీ విచారణ
పాలకుర్తి(రామగుండం): పుట్నూర్ గ్రామానికి చెందిన డీజే నిర్వాహకుడు మంచినీళ్ల రాకేశ్‌ను బసంత్‌నగర్ ఎస్సై స్వామి ఇటీవల కొట్టిన ఘటనపై సోమవారం బసంత్‌నగర్ ఠాణాలో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, ఏసీపీ కృష్ణ విచారణ జరిపారు. గణేశ్ ఉత్సవాల్లో భాగంగా డీజేలపై నిషేధం నేపథ్యంలో బైండోవర్ నిమిత్తం తనను ఠాణాకు రావాలని ఎస్సై ఆదేశించారని, తాను ఆలస్యంగా వెళ్లినందుకు బెల్ట్‌తో దాడిచేశారని బాధితుడు ఈనెల 4వ తేదీన రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. సీపీ ఆదేశాల మేరకు.. డీసీపీ, ఏసీపీలు.. బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సీసీ కెమెరా ఫుటేజీలను సైతం పరిశీలించినట్లు సమాచారం. అనంతరం పెద్దపల్లిలోని సీపీఐ కార్యాలయంలో మరోసారి బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించినట్లు తెలిసింది.
విచారణకు ఆదేశించాం
సింగరేణి కార్మికుడిపై సీఐ చేయిచేసుకున్న సంఘటనపై ఫిర్యాదు అందింది. దీనిపై మంచిర్యాల డీసీపీని విచారణకు ఆదేశించాం. పూర్తివిషయాలు తెలిసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం.
– అంబర్ కిశోర్ ఝా,
పోలీస్ కమిషనర్, రామగుండం

కట్టుదాటుతున్న ఖాకీలు