ఓదెల మల్లన్నకు పూజలు | - | Sakshi
Sakshi News home page

ఓదెల మల్లన్నకు పూజలు

Sep 9 2025 6:51 AM | Updated on Sep 9 2025 2:35 PM

ఓదెల(పెద్దపల్లి): చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మూసివేసిన ఓదెల మల్లికార్జున స్వామి ఆలయాన్ని సోమవారం తెరిచారు. తొలుత ఆలయంలో సంప్రోక్షణ చేశారు. ఆ త ర్వాత భక్తులకు దర్శన అవకాశం కల్పించారు.

రేపు ఓటరు తుది జాబితా

పెద్దపల్లిరూరల్‌: జిల్లాలో 137 ఎంపీటీసీ, 13 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని, ఈమేరకు ఓటరు తుదిజాబితా బుధవారం ప్రచురిస్తామని కలెక్టర్‌ శ్రీహర్ష తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం గుర్తింపు రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమయ్యారు. ఓటరు జా బితాపై అభ్యంతరాలుంటే మంగళవారంలోగా పరిష్కరిస్తామన్నారు. మున్సిపాలిటీల్లో గ్రా మాలు విలీనం కావడంతో మూడు ఎంపీటీసీ స్థానాలు తగ్గాయన్నారు. మేజర్‌ పంచాయతీ రెండు ఎంపీటీసీ స్థానాల పరిధిలో ఉంటే ఒక కుటుంబంలోని సభ్యులందరూ ఒకే ఎంపీటీసీ పరిధిలో ఉండేలా చూస్తామని తెలిపారు. జెడ్పీ సీఈవో నరేందర్‌, డీఎల్పీవో వేణుగోపాల్‌, నాయకులు ఉప్పు రాజ్‌కమార్‌, ముత్యంరావు, బొంకూరి సురేందర్‌సన్నీ, పల్లె సదానందం, అక్కపాక తిరుపతి తదితరులు ఉన్నారు.

గోదావరి తీరంలో నిఘా

మంథని: గోదావరి పరీవాహక ప్రాంతాలపై నిఘా ఉంచాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా సూచించారు. సోమ వారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను సీఐ రాజు, ఎస్సై రమేశ్‌ను అడిగి సమాచారం తెలుసుకున్నారు.

వినియోగదారులే ముఖ్యం

జ్యోతినగర్‌(రామగుండం): టీజీ ఎన్పీడీసీఎల్‌ విద్యుత్‌ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తోందని గోదావరిఖని ఈడీ ప్రభాకర్‌ అ న్నారు. స్థానిక ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్డులోని 33 కేవీ జీడీకే సర్క్యూట్‌–2ఫీడర్‌ విద్యుత్‌ లైన్‌ ఆదివా రం అర్ధరాత్రి పెద్దచెట్టు పడిపోయి లైన్‌ దెబ్బతిన్నది. స్పందించిన సిబ్బంది యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టగా.. డీఈ సోమవా రం పరిశీలించారు. గోదావరిఖని – గౌతమిన గర్‌కు మధ్య చెట్టు విరిగి పడడంతో విద్యుత్‌ తీ గెలు తెగిపడ్డాయన్నారు. తమ సిబ్బంది యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేశారని అన్నారు. ఏడీఈ వెంకటేశ్వర్లు, ఏఈ రామస్వామి, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ సీబీ రాజు తదితరులు పాల్గొన్నారు.

అందరికీ అక్షరజ్ఞానం

పెద్దపల్లిరూరల్‌: ప్రతీఒక్కరు చదువు నేర్చుకోవాలని వయోజన విద్యా శాఖ అసిస్టెంట్‌ ప్రా జెక్టు అధికారి శ్రీనివాస్‌ అన్నారు. అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో సో మవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. మహిళలు చదువుకునేందుకు ముందుకు రావా లని కోరారు. ఎంఈవో సురేందర్‌కుమార్‌, హెచ్‌ఎం నర్సింగరావు, పెద్దపల్లి క్లస్టర్‌ సీఆర్పీ బాలసాని వెంకటేశం తదితరులు ఉన్నారు.

ప్లాంటేషన్‌ పనుల పరిశీలన

కమాన్‌పూర్‌: గుండారం సమీపంలోని మంథని–పెద్దపల్లి మెయిన్‌ రోడ్డుకు ఇరువైపులా చేపట్టిన ప్లాంటేషన్‌ పనులను డీఆర్‌డీవో కాళిందిని పరిశీలించారు. అధికారులకు సూచనలిచ్చారు.

ఏఈవోల నిరసన

పెద్దపల్లిరూరల్‌: తమపై పనిభారం అధికమైందంటూ ఏఈవోలు సోమవారం కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. పలువురు వ్యవసాయ విస్తీర్ణాధికారులు తదితరులు పాల్గొన్నారు

ఓదెల మల్లన్నకు పూజలు1
1/1

ఓదెల మల్లన్నకు పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement