
సమస్యలు పరిష్కరించండి
పెద్దపల్లిరూరల్: ప్రజావాణి ద్వారా అందిన సమస్యలతో కూడిన వినతులను సత్వరమే పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ శ్రీహర్ష, అడిషనల్ కలెక్టర్ వేణుతో కలిసి వినతులు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి ద్వారా తమ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందనే నమ్మకంతో జిల్లావాసులు తరలివస్తారని, వారినమ్మకాన్ని వమ్ము చేయకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు.