
ఉపాధ్యాయుల పాత్ర కీలకం
పెద్దపల్లిరూరల్: భావిభారత పౌరులను క్రమశి క్షణ గలవారిగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులపాత్ర కీలకమైందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నా రు. కలెక్టరేట్‌లో సోమవారం గురుపూజోత్సవం నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఉత్తమ ఉపాధ్యాయులను అడిషనల్ కలెక్టర్ వే ణు, డీఈవో మాధవితో కలిసి ప్రశంసాపత్రాలు అందించి సత్కరించారు. విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
రెండు రోజుల పాటు వర్షాలు..
వచ్చే రెండురోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షా లు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. వాతావరణ శాఖ సూచన మేరకు జిల్లాకు ఆరెంజ్ అలర్డ్ జారీ చేశామని ఆయన అన్నారు.