
హైకోర్టుకు మెటా నిందితులు
విజయవాడలో ఉండి ముందస్తు బెయిల్ పిటిషన్
కౌంటర్ దాఖలు చేసిన కరీంనగర్ పోలీసులు
పోలీసుల అలసత్వంతోనే నిందితులు పరారయ్యారంటున్న బాధితులు
రెండుసార్లు పిటిషన్, ఒకసారి కేసు నమోదైనా ఉదాసీనత
అందుకే, నిందితులు పొరుగురాష్ట్రానికి వెళ్లారని విమర్శలు
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
మెటా ఫండ్ క్రిప్టో కరెన్సీ పేరిట ఉమ్మడి జిల్లాలో రూ.కోట్లు వసూలు చేసిన నిందితుల విషయంలో కరీంనగర్ పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. అధిక లాభాలు ఆశ చూపించి రూ.లక్షలు పెట్టుబడుల కింద తీసుకుని, బో ర్డు తిప్పేసిన కంపెనీ విషయంలో పోలీసులు మె తక వైఖరి అవలంబిస్తున్నారని బాధితులు మండిపడుతున్నారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్‌కు హైకోర్టును ఆశ్రయించడమే ఇందుకు ఉదాహరణ అని ఆరోపిస్తున్నా రు. అధిక లాభాల పేరిట పలువురు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారుల నుంచి ఒక్క క రీంనగర్ జిల్లాలోనే రూ.30 కోట్లు, సిరిసిల్ల, జగి త్యాల, పెద్దపల్లి జిల్లాలు రాష్ట్రవ్యాప్తంగా రూ. 100 కోట్ల వరకు వసూలు చేసిన మెటా ఫండ్ ప్ర తినిధుల్లో ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడం, నిందితులు యఽథేచ్ఛగా తిరుగుతుండటంపై బాధితులు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు.
రెండుసార్లు పిటిషన్, ఒకకేసు
మెటా కుంభకోణం కొత్తదేం కాదు. మే, జూన్‌లో కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని రూరల్, టూ టౌన్, కొత్తపల్లి పీఎస్ పరిధిల్లో పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయా ఠా ణాల్లో ఎస్‌హెచ్‌వోలు ఈ కేసు గ్రావిటీ తెలిసినప్పటికీ నిందితులతో చేతులు కలిపారని బాధితులు ఆరోపిస్తున్నారు. రూ.కోట్లు మోసం చేసిన వారికి అనుకూలంగా వ్యవహరించి, పిటిషన్ వె నక్కు తీసుకునేలా చేయడంలో పోలీసులు సఫ లీకృతమయ్యారని అంటున్నారు. జూలైలో ఇదే మెటా ఫండ్ కేసులో దాసరి రమేశ్, దాసరి రాజు పై పిటిషన్లు ఇచ్చినా.. ఈ రూ.కోట్ల కుంభకోణం గురించి వార్తాపత్రికల్లో కథనాలు వస్తున్నా.. నిందితులపై కేసుగా నమోదు చేయడంలో పోలీసులు తాత్సారం ప్రదర్శించారు. పిటిషనర్లు కూడా కేసు పెట్టేందుకు వెనకాడారు. తిరిగి అదే వ్యక్తుల పై మూడోసారి పిటిషన్ రావడం, ఈసారి పిటిషనర్ బలంగా నిలబడటంతో విధిలేక కేసు నమో దు చేసి, దర్యాప్తుకు మీన మేషాలు లెక్కించారు. బాధితులు ఉన్నతాధికారులను కలిసేందుకు సి ద్ధపడ్డారు. కేసు దర్యాప్తులో జాప్యాన్ని నివారించేందుకు కేసును సీసీఎస్‌కు అప్పగించారు. ఈ వి షయం లీకవడంతో నిందితులు విజయవాడకు పరారై అక్కడ నుంచి ముందస్తు బెయిల్‌కోసం హై కోర్టును ఆశ్రయించారు. దీనికి కరీంనగర్ పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు.