
రూ.వంద కోట్లతో గర్రెపల్లి – సుద్దాల రోడ్డు
ఎలిగేడు /సుల్తానాబాద్(పెద్దపల్లి): గర్రెపల్లి – సుద్దాల ఎక్స్‌రోడ్డు మధ్య రూ.100 కోట్లతో డ బుల్ రోడ్డు నిర్మిస్తామని, ఇందుకోసం పదిరోజు ల్లో శంకుస్థాపన చేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఎలిగేడు మండలం శివపల్లిలోని ఎమ్మెల్యే నివాసంలో ఆదివారం సుల్తానాబాద్ మండలంలోని కాంగ్రెస్ కా ర్యకర్తలు, ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. గర్రెపల్లి నుంచి బొంతకుంటపల్లి, నీరుకుల్ల, గట్టెపల్లి, కదంబాపూర్ ద్వారా సుద్దాల ఎక్స్‌రోడ్డు వరకు డబుల్ రోడ్డు నిర్మిస్తే ప్రజారవాణా మరింత మెరుగవుతుందన్నారు. కరీంనగర్ కు దూరభారం తగ్గుతుందని తెలిపారు. భవిష్యత్తులో ఆర్టీసీ సౌకర్యం అందుబాటులోకి వస్తుంద ని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులు విజయం సాధించేలా అందరూ పని చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకావ్‌రావు, కాంగ్రెస్ నాయకులు ధనమనేని ఆ నందరావు, చీటి సతీశ్‌రావు, మాజీ సర్పంచులు బండారి రమేశ్, ఏరుకొండ రమేశ్‌గౌడ్, జూపల్లి తిరుమల్‌రావు తదితరులు పాల్గొన్నారు.