
మట్టి మహాగణపతి నిమజ్జనం
పెద్దపల్లిరూరల్: రాష్ట్రంలోనే ఖైరతాబాద్ తర్వాతి స్థానంలో నిలిచిన జిల్లా కేంద్రంలోని మట్టి మహాగణపతి (61 అడుగుల ఎత్తు) నిమజ్జనోత్సవం శనివారం రాత్రి నిరాడంబరంగా జరిగింది. నవరాత్రులపాటు పూజలు అందుకున్న పే..ద్దగణపతి నిమజ్జనోత్సవాలను తిలకించేందుకు పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన గణపయ్యను ఫైరింజన్ల సాయంతో అగ్నిమాపకఅధికారులు, సిబ్బంది నిమజ్జనం చేయడంలో సహకరించారు.
లడ్డూ వేలం రూ.2,02,000
మట్టి మహాగణపతి చేతిలోని లడ్డూను రూ.2,02,000లకు అనుదీప్‌సింగ్ బృందం వేలంలో పాటపాట దక్కించుకుంది. అలాగే బ్రహ్మకలశాన్ని పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు ఠాకూర్ విజయ్‌సింగ్ (బాషా) రూ.47వేలకు దక్కించుకున్నారు.

మట్టి మహాగణపతి నిమజ్జనం