
రాజన్నకు భక్తుల నీరాజనం
వేములవాడ: రాజన్నను శనివారం 15వేల మంది భక్తులు దర్శించుకున్నారు. అభిషేకాలు, అన్నపూజలు, కల్యాణాలు, సత్యనారాయణ వ్రతాల మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్నను సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ(సెర్ప్) అడిషనల్ సీఈవో కాత్యాయనిదేవి, రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ కమిషనర్ సీతాలక్ష్మి వేర్వేరుగా దర్శించుకున్నారు. నాగిరెడ్డి మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ఈవో రమాదేవి, పర్యవేక్షకులు జి.శ్రీనివాస్‌శర్మ, ఆలయ ఇన్‌స్పెక్టర్ నూగూరి నరేందర్, ప్రొటోకాల్ అధికారులు అశోక్, సింహాచార్యులు పాల్గొన్నారు.
అలరించిన ‘ట్రినిటి’ ఫ్రెషర్స్ డే
కరీంనగర్‌కల్చరల్: నగరంలోని శుభం గార్డెన్‌లో శుక్రవారం రాత్రి నిర్వహించిన ట్రినిటి జూనియర్ కళాశాల (గర్‌ల్స్) ఫ్రెషర్స్ డే వేడుకలు అలరించాయి. ట్రినిటి వ్యవస్థాపక చైర్మన్ దాసరి మనోహర్‌రెడ్డి, ట్రినిటి గ్రూప్ చైర్మన్ దాసరి ప్రశాంత్‌రెడ్డిలు జ్యోతిప్రజ్వలన చేసి మాట్లాడుతూ ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు ముందుఆ నిర్వహించే ఆలోచన ఉన్నందున ఆ దిశగా విద్యార్థులు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని సూచించారు. మీ ప్రయాణం ఆధ్యాత్మికత, విద్య, క్రీడా, సాంస్కృతిక అభివృద్ధితో నిండి ఉండాలని అన్నారు. ఇంటర్‌లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన సర్టిఫికెట్లు, ట్రోఫీలు అందజేశారు. విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.
నలుగురిపై కేసు
జమ్మికుంట: దాడికి పాల్పడిన నలుగురిపై కేసు నమోదు చేసినట్టు టౌన్ సీఐ రామకృష్ణ శనివారం తెలిపారు. పట్టణంలోని కొండూరి కాంప్లెక్స్‌లో శుక్రవారం రాత్రి గణపతి ఉరేగింపు జరిగింది. శాలవాడకు చెందిన యువసేన యూత్‌క్లబ్ సభ్యులు శ్యామ్, సందీప్, రాకేశ్, హేమంత్ శోభాయాత్రలో గెల్లు రాజశేఖర్, గౌడ శ్రీనివాస్‌పై దాడి చేశారు. ఇద్దిరికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
కాత్యాయనిదేవికి స్వామి వారి
ప్రసాదాలు అందజేస్తున్న అర్చకులు
సోషల్ వెల్ఫేర్ కమిషనర్ సీతాలక్ష్మికి ప్రసాదాలు అందిస్తున్న అర్చకులు

రాజన్నకు భక్తుల నీరాజనం

రాజన్నకు భక్తుల నీరాజనం