
ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యేలు
గోదావరిబ్రిడ్జిపై ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్, ఏసీపీ రమేశ్
సుల్తానాబాద్ చెరువు వద్ద పరిశీలిస్తున్న ఎమ్మెల్యే విజయరమణారావు
గోదావరిఖని/పెద్దపల్లిరూరల్/సుల్తానాబాద్: గోదావరిబ్రిడ్జి వద్ద గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను గురువారం రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ పరిశీలించారు. బ్రిడ్జిపై సింగరేణి యాజమాన్యం, మున్సిపల్‌యంత్రాంగం, ఆర్‌ఎఫ్‌సీఎల్ చేసిన ఏర్పాట్లను తెలుసుకున్నారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్, అదనపు కలెక్టర్ అరుణశ్రీ తదితరులున్నారు. అలాగే సుల్తానాబాద్ చెరువువద్ద నిమజ్జన ప్రాంతాన్ని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పరిశీలించారు. సుల్తానాబాద్, పెద్దపల్లిలో మినీట్యాంక్ బండ్ వద్ద క్రేన్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. గ్రంథాలయ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మునిపాల ప్రకాశ్‌రావు, విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ తదితరులున్నారు. పెద్దపల్లి మండలం అప్పన్నపేట చెరువులో నిమజ్జన ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. తహసీల్దార్ రాజయ్య, ఎంపీడీవో శ్రీనివాస్ తదితరులున్నారు.

ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యేలు