కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే యూరియా కొరత | - | Sakshi
Sakshi News home page

కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే యూరియా కొరత

Sep 5 2025 5:02 AM | Updated on Sep 5 2025 5:02 AM

కేంద్

కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే యూరియా కొరత

కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే యూరియా కొరత

పెద్దపల్లిరూరల్‌: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతోనే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని సీపీఐ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. బుధవారం పెద్దపల్లిలో పార్టీ జిల్లా కౌన్సిల్‌ సమావేశం జిల్లా కార్యదర్శి సదానందం అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతాంగానికి అవసరమైన యూరియా తెప్పించేందుకు రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించి సత్తా చూపాలని కోరారు. అనంతరం సురవరం సుధాకర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గౌతం గోవర్ధన్‌, ఎల్లాగౌడ్‌, వైవీ రావు, స్వామి, గౌస్‌, రాంచందర్‌, రాజారత్నం, సునీల్‌, సూర్య, బాలసాని లెనిన్‌, చంద్రశేఖర్‌, శంకర్‌, రమేశ్‌, శ్రీనివాస్‌, లక్ష్మణ్‌, నవీన్‌ తదితరులున్నారు.

నేడు రేషన్‌ పంపిణీ బంద్‌

ఓదెల(పెద్దపల్లి): తమ సమస్యలు పరిష్కరించకపోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం జిల్లాలోని 413 రేషన్‌ దుకాణాల్లో సరుకుల పంపిణీ బంద్‌ చేస్తున్నట్లు డీలర్ల సంఘం జిల్లా కమిటీ ప్రతినిధి మద్దెల నర్సయ్య తెలిపారు. ఈసందర్భంగా జిల్లా సీవిల్‌సప్లయ్‌ అధికారికి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా కమీషన్‌ పెంచాలని కోరారు.

లంపీస్కిన్‌ వ్యాధి నివారణకు చర్యలు

కోల్‌సిటీ(రామగుండం): జిల్లాలో పశువులకు సోకుతున్న లంపీస్కిన్‌ డిసీస్‌(ఎల్‌ఎస్‌డీ) నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పశువైద్యాధికారి కె.విజయభాస్కర్‌ తెలిపారు. ఇటీవల విధుల్లో చేరిన ఆయన గురువారం తొలిసారి గోదావరిఖని పశువైద్యశాలను పరిశీలించారు. పశువులకు వ్యాక్సిన్లు వేస్తున్న తీరును పరిశీలించారు. వీధి పశువుల్లో లంపీస్కిన్‌ వ్యాధి తీవ్రంగా ఉందని, రైతులు తమ పశువులను ఇంటిలోనే కట్టివేసి ఉంచాలని సూచించారు. పశువుల ఒంటిపై దద్దుర్లు కనిపించిన వెంటనే లంపీ స్కిన్‌ వ్యాధిగా గ్రహించాలని, వెంటనే పశువైద్యశాలకు తరలించి చికిత్స అందించాలని వెల్లడించారు. పారవేట్స్‌ జిల్లా కార్యదర్శి డి.చంద్రశేఖర్‌, ఎస్‌ఎల్‌ఏ రామ్‌కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

మైనింగ్‌ భూసేకరణలో వేగంపెంచాలి

పెద్దపల్లిరూరల్‌: జిల్లాలోని సింగరేణి మైనింగ్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియలో వేగం పెంచాలని కలెక్టర్‌ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. రామగిరి మండలం బుధవారంపేటలో సింగరేణి ఆర్జీ–2 ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌ కోసం 86ఎకరాలు సేకరించాల్సి ఉండగా 76 ఎకరాలకు అవార్డు పాసయిందన్నారు. మిగతా 10 ఎకరాలకు సత్వరమే పాస్‌ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్జీ–3 కి సంబంధించి లద్నాపూర్‌లో పోచమ్మ ఆలయ పనులు ఈనెల 10 వరకు పూర్తికావాలన్నారు. మంథని ఆర్డీవో సురేశ్‌, స్పెషల్‌ డెప్యూటీ కలెక్టర్‌, సింగరేణి మేనేజర్లు, తదితరులున్నారు.

టాస్క్‌ శిక్షణకు 10లోగా నమోదు చేసుకోండి

టాస్క్‌ సెంటర్‌లో శిక్షణ పొందేందుకు ఆసక్తిగల యువత ఈనెల 10లోగా తమపేర్లు నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ శ్రీహర్ష కోరారు. వృత్తి నైపుణ్యశిక్షణ పొందినవారిలో 30శాతం మందికే ఉద్యోగావకాశాలు దక్కుతున్నాయని, ఆ శాతాన్ని 60కి పెంచేలా టాస్క్‌, టిహబ్‌, టీవర్క్స్‌ సంస్థలు పనిచేస్తున్నాయన్నారు. టాస్క్‌ ప్రతినిధులు ప్రదీప్‌రెడ్డి, సుధీర్‌ తదితరులున్నారు.

కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే యూరియా కొరత
1
1/2

కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే యూరియా కొరత

కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే యూరియా కొరత
2
2/2

కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే యూరియా కొరత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement