పెద్దపల్లిరూరల్: ఇందిరమ్మ ఇళ్ల పనులు పూర్తిచేసేలా చూడాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. వనమహోత్సవం, ఇందిరమ్మ ఇళ్ల ప్ర గతిపై మంగళవారం తన కార్యాలయంలో స మీక్షించారు. జిల్లాలో 4,031 ఇళ్ల పనులకు మా ర్కింగ్ ఇచ్చామని, 1,892 ఇళ్లు బేస్‌మెంట్‌స్థా యి, 414ఇళ్లు స్లాబ్‌స్థాయిలో ఉన్నాయని, మ రో 1,579 ఇళ్లు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. స్థానిక ఎన్నికలు వచ్చేలోపే పనులు ప్రారంభించేలా లబ్ధిదారులను ప్రోత్సహించా లని సూచించారు. పీడీ రాజేశ్వర్‌రావు, సీఈవో నరేందర్, డీపీవో వీరబుచ్చయ్య పాల్గొన్నారు.
భూ సమస్యలు పరిష్కరించాలి
సుల్తానాబాద్(పెద్దపల్లి): భూ భారతి దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహ ర్ష ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయా న్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాదాబైనామాల పరిష్కారానికి హైకోర్టు అ నుమతి ఇచ్చిన నేపథ్యంలో నిబంధనల ప్రకా రం దరఖాస్తులను సిద్ధం చేయాలని సూచించా రు. అసైన్డ్ భూముల పట్టాల కోసం వచ్చిన అర్జీల్లో అర్హుల జాబితా సిద్ధం చేయాలన్నారు. తహసీల్దార్ బషీరొద్దీన్ పాల్గొన్నారు.
న్యాయం చేయాలి
గోదావరిఖని: సమస్యలపై ఠాణాకు వచ్చే బా ధితులకు న్యాయం చేయాలని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ సూచించారు. మంగళవారం స్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. అ నంతరం గణేశ్ మండపాలను తనిఖీ చేశారు. నిమజ్జన ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో ముగించాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా వేడుకలు
పెద్దపల్లిరూరల్: గణపతి నవరాత్రి, నిమజ్జన వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగే స హకరించాలని ఏసీపీ కృష్ణ సూచించారు. సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు లక్ష్మణ్‌రావు, నరేశ్‌తో కలిసి వినాయక మండప నిర్వాహకులతో మంగళవారం జిల్లా కేంద్రంలో ఏసీపీ సమావేశమై పలు సూచనలు చేశారు. పోలీసు, మున్సిపల్ అధికారులకు సహకారం అందించాలని కోరా రు. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా మున్సిప ల్ సిబ్బంది సూచనలు పాటించాలని, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు.
‘మోడల్’ విద్యార్థిని ప్రతిభ
ధర్మారం(ధర్మపురి ): స్థానిక మోడల్ స్కూల్‌లో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న వనం అఖిల రాష్ట్రస్థాయి అ థ్లెటిక్స్ పోటీల్లో ద్వితీయస్థానంలో నిలిచిందని, తద్వారా సిల్వర్ మెడల్ సాధించింద ని పీఈటీ కొమురయ్య మంగళవారం తెలిపా రు. మహబూబ్‌నగర్‌లో జరిగిన 11వ రాష్ట్రస్థా యి అండర్– 18 హైజంప్‌లో అఖిల ప్రతిభ చూపిందని వివరించారు. అఖిలను ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్‌కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు బైకని కొమురయ్య, మేకల సంజీవరావు మంగళవారం అభినందించారు.
6న ఉద్యోగులకు క్రీడాపోటీలు
పెద్దపల్లిరూరల్: ప్రభుత్వ ఉద్యోగులకు ఈనెల 6న క్రీడాపోటీలను నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడల శాఖ అధికారి సురేశ్ తెలిపారు. అథ్లెటి క్స్, బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్, క్రికెట్, యో గా, క్యారెం, ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ, లాన్‌టెన్నిస్, పవర్ లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, బెస్ట్‌ఫిజిక్, ఖోఖో విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారన్నారు. వివరాలకు 99890 90097 నంబరులో సంప్రదించాలని కోరారు.
మొక్కలను సంరక్షించాలి
పెద్దపల్లిరూరల్: వనమహోత్సవంలో నాటిన మొక్కలను సంరక్షించాలని డీపీవో వీరబుచ్చ య్య సూచించారు. రాఘవాపూర్, రంగాపూర్, సబ్బితంలో రోడ్ల వెంట నాటిన మొక్కలను ఎంపీడీవో శ్రీనివాస్ కలిసి పరిశీలించారు.
ఇందిరమ్మ ఇళ్లు గ్రౌండింగ్ చేయాలి
ఇందిరమ్మ ఇళ్లు గ్రౌండింగ్ చేయాలి
ఇందిరమ్మ ఇళ్లు గ్రౌండింగ్ చేయాలి