నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు
పెద్దపల్లిరూరల్: వినాయక నిమజ్జనోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సూచించారు. ఇందుకోసం స్థానిక ఎల్లమ్మ, గుండమ్మ చెరువుల వద్ద రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. స్థానిక మినీట్యాంకు బండ్ ప్రాంతాన్ని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, ఏసీపీ కృష్ణ, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ స్వరూప తదితరులతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. క్రేన్‌లు, ఇతర యంత్రాలు, రెస్క్యూ సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం ప్రక్రియ పూర్తయ్యేలా నిర్వాహకులు సహకరించాలని ఆయన కోరారు. మున్సిపల్ ఏఈ సతీశ్, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
18 గంటలు ప్రజలకోసమే పనిచేస్తున్నా..
ఓదెల(పెద్దపల్లి): ప్రజల కోసం తాను 18 గంటల పాటు పనిచేస్తున్నానని ఎమ్మెల్యే విజయరమణా రావు అన్నారు. ఉప్పరపల్లె, గోపరపల్లె, హరిపురం, కొలనూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు అనుమతిపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం రేవంత్‌రెడ్డి పేదలకు సన్నబియ్యం అందిస్తున్నారన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని ఆయన కోరారు. నాయకులు మూల ప్రేంసాగర్‌రెడ్డి, ఆళ్ల సుమన్‌రెడ్డి, గోపు నారాయణరెడ్డి, చీకట్ల మొండయ్య, బైరి రవిగౌడ్, చింతిరెడ్డి విజేందర్‌రెడ్డి, చిలుక హరికాంత్, చేగొండ గట్టయ్య, దొడ్డె స్వామి, గుండేటి మధు పాల్గొన్నారు.


