
అధికారులూ.. అప్రమత్తంగా ఉండండి
కోల్‌సిటీ/జ్యోతినగర్(రామగుండం): భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. బల్దియా కమిషనర్ అరుణశ్రీతో కలిసి నగరంలోని లోతట్టు ప్రాంతాలైన రాజలక్ష్మికాలనీ, మల్కాపూర్ శివారులోని వరద ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ శనివారం పర్యటించారు. అనంతరం బల్దియా అధికారులతో పారి శుధ్యం నిర్వహణ, దోమల నివారణకు ఫాగింగ్, అభివృద్ధి పనులు, రోడ్ల విస్తరణ తదితర అంశాలపై సమీక్షించారు. అడిషనల్ కమిషనర్ మారుతి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, సెక్రట రీ ఉమామహేశ్వర్‌రావు, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఈఈ రామన్, డీఈలు జమీల్, చంద్రమౌళి, టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్ నవీన్, ఆర్‌ఐ ఆంజనేయులు, ఏఈ మీర్, పబ్లిక్ హెల్త్ డీఈ న ర్సింహస్వామి, ఏఈ మౌనిక తదితరులు పాల్గొన్నా రు. అదేవిధంగా ఫైవింక్లయిన్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్(యూపీహెచ్‌సీ)ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందులు, పేషెంట్లు, వైద్య సేవలపై ఆరా తీశారు.
ఉద్యోగాలు ఇస్తామంటే నమ్మొద్దు
పెద్దపల్లిరూరల్: కలెక్టరేట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామనే దళారులను నమ్మి ఎవరికీ డబ్బులివ్వొద్ద కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడారు. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిన ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగావకాశాలను కల్పిస్తామని కొందరు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని అన్నారు. వారధిలో పేరు నమోదు చేసుకున్న వారి అర్హతలను పరిశీలించాకే ఎంపిక ఉంటుందని ఆయన తెలిపారు. ప్రధాన రోడ్ల పక్కన వనమహోత్సవం ద్వారా ఎత్తయిన 40వేల మొక్కలు నాటాలని సూచించారు. డీఎంఎఫ్‌టీ బేస్‌లైన్ సర్వే వివరాలపై సెప్టెంబరు 7వ తేదీ వరకు బుక్‌లెట్ తయారు చేయాలని ఆదేశించారు. ఇంట్రా ఈఈ శ్రీనివాస్, సంక్షేమశాఖ ఇన్‌చార్జి అధికారి వేణుగోపాల్, పీడీ రాజేశ్వర్, జెడ్పీ సీఈవో నరేందర్, డీఆర్డీవో కాళిందిని, డీఎఫ్‌వో శివయ్య, డీపీవో వీరబుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.