మంథని: యూరియా కోసం రైతులు తంటాలు ప డుతుంటే మంథని ఎమ్మెల్యే స్థానికంగా సమావే శం పెట్టి వెళ్లిపోయారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు విమర్శించారు. స్థానిక పాతపెట్రోల్ బంక్ సమీపంలోని రైతు సేవా కేంద్రాన్ని ఆయన శనివారం సందర్శించారు. గోదాంలో 110 బస్తాల యూరియా ఉందని, ఇప్పటికే 40మంది టోకెన్లు తీసుకున్నారని వ్యాపారి వివరించారు. మిగిలిన వాటిపై ఆరా తీ యగా.. సమాధానం చెప్పలేదు. దీంతో ఆయనపై మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారి, వ్యవసా య అధికారులు, పోలీసుల తీరును నిరసిస్తూ చౌరస్తాలో రైతులతో కలిసి రాస్తారోకో చేశారు. యూరియాను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. వ్యవసాయ అధికారి, వ్యాపారిపై కే సు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకవద్దని హితవు పలికారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఏగోళపు శంకర్‌గౌడ్, నాయకులు కనవేన శ్రీనివాస్, గొబ్బూరి వంశీ, పుప్పాల తిరుపతి, బండ రవి, పెగడ శ్రీనివాస్ పాల్గొల్గొన్నారు.