
ఎరువుల దుకాణాలు తనిఖీ
కమాన్‌పూర్(మంథని): మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా విజిలెన్స్ అధికారులు శనివారం తనిఖీ చేశారు. ఎరువుల స్టాక్ రిజిష్టర్లు పరిశీలించారు. ఈపాస్ మిషన్ ద్వారా సాగిన ఎరువుల అమ్మకాలపై అధికారులు ఆరా తీశారు. ఎరువులను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. విజిలెన్స్ సీఐ వరుణ్ ప్రసాద్, ఏవో రామకృష్ణ, ఏఈ శ్రీకాంత్, హెడ్‌కానిస్టేబుల్ నారాయణ, కానిస్టేబుల్ అశోక్ పాల్గొన్నారు.
సింగరేణి జీఎంల బదిలీ
గోదావరిఖని: సింగరేణిలోని పలువురు జీఎంలను బదిలీచేస్తూ యాజమాన్యం శనివారం ఆదేశాలు జారీచేసింది. రామగుండం రీజియన్ క్వాలిటీ జీఎం డి.భైద్యాను నైనీ ఏరియాకు బదిలీ చేశారు. నైనీ ఏరియా జీఎం ఎస్.ముజుందార్‌ను రామగుండం రీజియన్ క్వాలిటీ జీఎంగా బదిలీ చేశారు. కార్పొరేట్ ఎస్టేట్ జీఎం ఎన్.రాధాకృష్ణను మందమర్రి జీఎంగా బదిలీ చేయగా, మణుగూరు పీకే ఓసీపీ అధికారి టి.లక్ష్మీపతిగౌడ్‌ను కార్పొరేట్ ఎస్టేట్ హెచ్‌వోడీగా బదిలీ చేశారు.