
‘గేట్లు ఎత్తినా పంట పొలాలు మునిగాయ్’
మంథని: పార్వతీ బ్యారేజీ గేట్లు ఎత్తి దిగువకు నీ టిని విడుదల చేస్తున్నా గోదావరి బ్యాక్‌వాటర్‌తో ఎగువన ఉన్న పంట పొలాలు నీట మునిగిపోయా యని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. పట్టణ సమీపంలోని గోదావరి వరద ప్రవాహాన్ని, నీట మునిగిన పంటలను ఆయన శుక్రవారం పరిశీలించారు. బ్యారేజీలు వృథా అని, వాటినీళ్లతోనే పంట పొలాలు నీటమునిగి రైతులు నష్టపోతున్నారని మాట్లాడే వారు బ్యారేజీ గేట్లు ఎత్తి ఉన్నా ఒక్కచుక్క ఆపకుండా ఎలా మునిగిపోయాయో సమాధానం చెప్పాలన్నారు. ప్రాజెక్టును నీరుగార్చి ప్రజలకు అందుబాటులోకి రాకుండా చేశారని ఆయన మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ పారదర్శకంగా కట్టించిన కాళేశ్వరంతో ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంటే మంథని ఎమ్మెల్యే కళ్లు మండిపోతున్నాయ ని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్, కేసీఆర్ పేరు చిరకాలం ఉంటుందనే కక్షతోనే కుట్ర లు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఏగోళపు శంకర్ గౌడ్, నాయకులు తరగం శంకర్‌లాల్, పుప్పాల తిరుపతి తదితరులు ఉన్నారు.