
ముందస్తు చర్యలు తీసుకున్నాం
బ్యాక్ వాటర్ ముంపు ముప్పును అధిగమించడానికి ముందుస్తు చర్యలు చేపట్టాం. అందుకే భారీవర్షాలు, వరదల్లో ఇప్పుడు రామగుండం సేఫ్‌గా ఉంది. నేను కూడా స్వయంగా పర్యటించా. ఎక్కడ కూడా బ్యాక్ వాటర్‌తో ప్రజలకు ఇబ్బంది లేదు. సుమారు రూ.70కోట్లు వెచ్చించి, వరద, మురుగునీరు సాఫీగా పారేలా మేజర్ నాలాలను అభివృద్ధి చేశాం.
– మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, రామగుండం ఎమ్మెల్యే
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నాం. లోతట్టు ప్రాంతాలను నిత్యం పర్యవేక్షిస్తున్నాం. మల్కాపూర్ శివారులో కల్వర్టు వరకు వరద రాగా, ఆ ప్రాంతంతోపాటు పాములపేట వాసులను అప్రమత్తం చేశాం. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేశాం. కరకట్టపై ఎస్టిమేషన్ తయారు చేయాలని ఇరిగేషన్ అధికారులను కోరాం. – అరుణశ్రీ, కమిషనర్, రామగుండం బల్దియా

ముందస్తు చర్యలు తీసుకున్నాం