
చట్టాలపై అవగాహన ఉండాలి
పెద్దపల్లిరూరల్: చట్టాలపై కనీస అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కా ర్యదర్శి స్వప్నరాణి సూచించారు. జిల్లా కేంద్రంలోని బీసీ బాలుర కాలేజీ హాస్టల్‌లో శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. న్యాయవాదులు శ్రీనివాస్, భాను, సంకీర్తన, ఝాన్సీ, రమేశ్‌బాబు, శరత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈఎస్‌ఐ ఆస్పత్రి టెండరు పూర్తి
గోదావరిఖని: రామగుండంలో ఈఎస్‌ఐ ఆస్ప త్రి నిర్మాణం కోసం రూ.150 కోట్లతో టెండర్ ప్రక్రియ శుక్రవారం పూర్తయినట్లు అధికారులు సమాచారమిచ్చారని ఎంపీ వంశీకృష్ణ తెలిపా రు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మన రా ష్ట్రానికి 50 వేల టన్నుల యూరియా కేటాయించేందుకు కేంద్రమంత్రులు అంగీకరించారని, ప్రస్తుతం 25వేల టన్నులు, వచ్చేనెల మరో 25వేల టన్నులు సరఫరా చేస్తారని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యంతో ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో తర చూ సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయని ఆ రోపించారు. నాయకులు గుమ్మడి కుమారస్వా మి, బోయిని మల్లేశ్‌యాదవ్, అనుమాస శ్రీని వాస్, కల్వల సంజీవ్, తిప్పారపు మధు, జావె ద్, శ్రీధర్ పటేల్, సురేందర్ పాల్గొన్నారు.
పెద్దపల్లిరూరల్: జిల్లా ఇ న్‌చార్జి వైద్యాధికారిగా వా ణిశ్రీకి అదనపు బాధ్యత లు అప్పగిస్తూ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్వర్వులు జారీ చేశారు. జి ల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో మెటర్నరీ హెల్త్, న్యూట్రిషన్ కో ఆర్డినేటర్‌గా వాణిశ్రీ పనిచేస్తున్నారు. ఇదే కార్యాలయంలో అడిషనల్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న అన్నప్రసన్నకుమారి అ దనపు బాధ్యతలు రద్దు చేశారు.
రామగుండం: శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టుల నుంచి ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టుకు వరద భా రీగా వచ్చి చేరుతోంది. దీంతో శుక్రవారం 39 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రా జెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 12.97 టీఎంసీలకు చేరింది. ఎస్సారెస్పీ నుంచి 5,00,245 క్యూసెక్కులు, కడెం నుంచి 27,648 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. గేట్లు ఎత్తి గోదావరిలోకి 7,13,538 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
సుల్తానాబాద్(పెద్దపల్లి): హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ ఆశయ సాధనకు కృషి చేయాలని డీవైఎస్‌వో సురేశ్ కోరారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శుక్రవారం ధ్యాన్‌చంద్ జయంతి ఘనంగా నిర్వహించారు. యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ అక్కపాక సురేశ్‌తో కలి సి సురేశ్ మాట్లాడారు. స్పోర్ట్స్‌క్లబ్ కార్యదర్శి అమిరిశెట్టి తిరుపతి, అంతర్జాతీయ బంగారు పతాక గ్రహీత గెల్లు మధుకర్‌యాదవ్, ఫిజికల్ డైరెక్టర్లు తాండ్ర ప్రణయ్, ఇక్భాల్, సత్యనారాయణ, రాజేశ్, అజ్జు, క్రీడాకారులు అమిరిశెట్టి రాకేశ్, సిద్ధం తిరుపతి, రాజు పాల్గొన్నారు.
పెద్దపల్లిరూరల్: కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వేల్పుల కుమారస్వామి, నాయకురాలు జ్యోతి డిమాండ్ చేశారు. కార్మికులతో కలిసి శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

చట్టాలపై అవగాహన ఉండాలి

చట్టాలపై అవగాహన ఉండాలి

చట్టాలపై అవగాహన ఉండాలి

చట్టాలపై అవగాహన ఉండాలి

చట్టాలపై అవగాహన ఉండాలి