
‘పల్లె’ ఓటర్ల సంఖ్య 4,04,209
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని 263 పంచాయతీల్లో 4,04,209 మంది ఓటర్లు ఉన్నారని, అందులో మ హిళా ఓటర్లు 2,05,451 మంది కాగా, పురుష ఓట ర్లు 1,98,744 మంది ఉండగా.. మరో 14 మంది ఇతరులు ఉన్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా పంచాయతీ అఽధికారి వీరబుచ్చయ్యతో కలిసి అధికారులు, రాజకీయ పా ర్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. జిల్లాలోని పంచాయతీ పరిధిలో 2,432 వార్డుల్లో డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల చేసినట్లు పేర్కొన్నారు. పంచాయతీల వారీగా జాబితా తయారు చేశామని, రాజకీ య పార్టీల ప్రతినిధులు జాబితాను పరిశీలించి అ భ్యంతరాలు ఉంటే ఈనెల 30లోగా ఎంపీడీవో కా ర్యాలయ అధికారులకు తెలపాలన్నారు. 31న అ భ్యంతరాలను పరిష్కరించి సెప్టెంబర్ 2న ఓటరు తుది జాబితాను ప్రచురిస్తామని వివరించారు.
విద్యతో విజ్ఞానం.. క్రీడలతో ఆరోగ్యం
జ్యోతినగర్(రామగుండం): విద్యతో విజ్ఞానం, క్రీ డలతో ఆరోగ్యం లభిస్తుందని జిల్లా విద్యాధికారి మాధవి అన్నారు. ఎన్టీపీసీ జెడ్పీ హైస్కూల్ క్రీడా మైదానంలో ఉమ్మడి రామగుండం(పాలకుర్తి–అంతర్గాం– రామగుండం ఈస్ట్ వెస్ట్) మండల జోన్‌స్థా యి టోర్నమెంట్, సెలక్షన్స్ పోటీలు నిర్వహించా రు. తొలుత జాతీయ హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. డీఈవో మాట్లాడుతూ, సుల్తానాబాద్ మండలం సు ల్తానాపూర్ గ్రామానికి చెందిన అంతర్జాతీయ ఆర్చ రీ క్రీడాకారురాలు చికిత అంతర్జాతీయ వేదికపై మెరవడం మనజిల్లాకు గర్వకారణమన్నారు. ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్, ఎంఈవో లు మల్లేశ్, విమల, ఏకాంబరం, పేట జిల్లా అధ్యక్షుడు సురేందర్, రమేశ్, రామగుండం జోనల్ కార్యదర్శి శోభారాణి, సోమశేఖర్, మాధవి, జావిద్, తిరుపతి, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

‘పల్లె’ ఓటర్ల సంఖ్య 4,04,209