
నిర్వాహకులదే బాధ్యత
కోల్‌సిటీ(రామగుండం): బయో మెడికల్ వేస్ట్ నిర్వహణ బాధ్యతలు ఆస్పత్రులు, క్లినిక్‌ల ని ర్వాహకులదేనని డీఎంహెచ్‌వో అన్న ప్రసన్న కుమారి స్పష్టం చేశారు. బల్దియా కార్యాల యంలో మంగళవారం నగరంలోని ఆస్పత్రు లు, క్లినిక్‌లు, డెంటల్ ఆస్పత్రులు, ల్యాబ్‌లు, డయాగ్నోస్టిక్, ఇమేజింగ్ సెంటర్ల నిర్వాహ కులు, వైద్యులతో బయో మెడికల్ వేస్ట్ నిర్వహణపై అవగాహన కల్పించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి పొందిన కరీంనగర్‌లోని వెంకటరమణ ఇన్సినరేటర్ ఏజెన్సీ ద్వారానే బయో మెడికల్ వ్యర్థాలను డిస్పోజ్ చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా వెంకటరమణ ఇన్సినరేటర్స్ ఏజెన్సీ ప్రతినిధి సతీశ్.. బయో మెడికల్ వ్యర్థాలను వేరుచేసే విధానంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఐఎంఏ అధ్యక్షుడు క్యాస శ్రీనివాస్, డాక్టర్లు దామెర అనిల్‌కుమార్, మోహన్‌రావు, మెడికల్ అసో సియేషన్ నాయకులు కజాంపురం రాజేందర్, కరుణాకర్, భిక్షపతి పాల్గొన్నారు.
లింగ నిర్ధారణ చట్ట విరుద్ధం
పెద్దపల్లిరూరల్: లింగ నిర్ధారణ చట్ట విరుద్ధమని జిల్లా వైద్యాధికారి అన్నప్రసన్నకుమారి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో జిల్లా అడ్వయిజరీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జిల్లాలో మొత్తం 32 స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ప్రతీ స్కానింగ్‌ను ఆన్‌లైన్ చేయాలని సూచించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా, చేయించుకున్నా, ప్రోత్సహించినా చట్ట రీత్యానేరమని తెలిపారు. ఇందుకు మూడేళ్ల దాకా జైలుశిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తారని పేర్కొన్నారు. స్కానింగ్ సెంటర్లను ప్రతినెలా తనిఖీ చేస్తున్నామని అన్నారు. ప్రోగ్రాం అధికారి వాణిశ్రీతోపాటు రవీందర్, ఫాతిమా, రెడ్‌క్రాస్‌సొసైటీ కన్వీనర్ రాజగోపాల్, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
మాజీ హోంగార్డ్ అరెస్ట్
గోదావరిఖని: జడ్జిని అడ్డుకొని పోలీస్ కాని స్టేబుల్‌పై దాడికి పాల్పడ్డారనే కేసులో మాజీ హోంగార్డ్ మామిడి పద్మను అరెస్టు చేసినట్లు గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి మంగళవారం తెలిపారు. ఓ లేఖ పట్టుకుని జడ్జి వాహనానికి అడ్డుగా వెళ్లడంతో పోలీసులు ఆమెను ఆపివేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలో కానిస్టేబుల్‌పై రాయి విసరగా గాయాలయ్యాయని తెలిపారు. ఈమేరకు నిందితురాలిపై కేసు నమోదు చేశామమని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించామని సీఐ వివరించారు.