
పెద్దపల్లి
న్యూస్‌రీల్
పంపిణీపై వీడిన సందిగ్ధం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం చేపపిల్లల కోసం ఈ టెండర్ జిల్లాలో చెరువులు 1073 చేపపిల్లల లక్ష్యం 1.58కోట్లు
బుధవారం శ్రీ 27 శ్రీ ఆగస్టు శ్రీ 2025
సాక్షి పెద్దపల్లి: నీలివిప్లవం పథకంలో భాగంగా చెరువులు, కుంటల్లో చేపపిల్లలు పంపిణీ చేసేందుకు ఎట్టకేలకు రంగం సిద్ధమవుతోంది. ఈమేరకు టెండరు ప్రక్రియ ఖరారు చేయడంలో జిల్లా అధికారులు నిమగ్నమయ్యారు. ఇటీవల కురిసిన వర్షాలతో కొన్నిచెరువులు మినహా దాదాపు అన్నింట్లోకి వరదనీరు వచ్చిచేరింది. వాటిలో చేపపిల్లలను వదిలేందుకు మత్య్సశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆన్‌లైన్ టెండర్లను పిలిచింది. చెరువుల సామర్థ్యానికి అనుగుణంగా చేపపిల్లలను విడుదల చేయనున్నారు. ఈసారి తమ ఉపాధికి భరోసా దక్కినట్లయ్యిందని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆన్‌లైన్‌లో టెండర్లు
ప్రతీ సీజన్ మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్రస్థాయిలో ఆన్‌లైన్ టెండర్లను ఆహ్వానించారు. ఈనెల 18 నుంచి ఆన్‌లైన్‌లో టెండర్ ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్ 1, మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్లు దాఖలు చేసేందుకు గడువు ఇచ్చారు. అదేరోజు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి టెండర్లను తెరవనున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అనుగుణంగా దాఖలైన టెండర్లను ఖరారు చేయనున్నారు. సెప్టెంబర్ రెండోవారం నుంచే చేపపిల్లలను విడుదల చేసేలా జిల్లా అధికార యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
1,073 చెరువులు.. 1.58 కోట్ల చేపపిల్లలు..
జిల్లాలో ఎల్లంపల్లి ప్రాజెక్టుతోపాటు సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు, చెరువులు, కుంటల్లో చేపలు, రోయ్యలు విడుదల చేయనున్నారు. సుందిళ్ల బ్యారేజీలో 11.41లక్షలు, అన్నారం బ్యారేజీలో 8.79లక్షలు, ఎల్లంపల్లిలో 6.10లక్షలు, 1,073 చెరవులు, కుంటల్లో 1.58కోట్ల చేపపిల్లలను పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందులో 35 ఎం.ఎం. నుంచి 40ఎం.ఎం. సైజ్ వి 1.02కోట్లు, 80 ఎం.ఎం. నుంచి 100 ఎం.ఎం. సైజ్‌వి 56.80లక్షలు ఉన్నాయి. గతేడాది చిన్నసైజ్ చేపపిల్లలను పంపిణీ చేయడంతో మత్స్యకారులు అడ్డుకోవడంతో మధ్యలోనే నిలిపివేశారు. ఈసారైనా టెండర్ల దక్కించుకున్న కాంట్రాక్టర్లు.. నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా పెద్దసైజ్, నాణ్యతగల చేపపిల్లలను పంపిణీ చేయాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు.
పంపిణీ తీరు ఇలా
సొసైటీలు 281
సభ్యులు 13450
చెరవులు, కుంటలు 1,073
ఈఏడాది లక్ష్యం(కోట్లలో) 1.58
నాణ్యమైనవే పంపిణీ
జిల్లాలోని జలాశయాలు, చెరువుల్లో సగానికిపైగా నీరుచేరిన తర్వాత చేపపిల్లలు పంపిణీ చేస్తాం. వాటి సరఫరాకు రాష్ట్ర మత్స్యశాఖ ఆదేశాల మేరకు టెండర్లు పిలిచాం. సెప్టెంబర్ 1న మధ్యాహ్నం 3గంటల వరకు దరఖాస్తు దాఖలుకు గడువు ఉంది. అదేరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు బిడ్స్ ఓపెన్ చేస్తారు. చేపపిల్లలను సరఫరా చేసే వ్యాపారులు పారదర్శకత పాటించాలి.
– నరేశ్ నాయుడు, జిల్లా మత్స్యశాఖ అధికారి

పెద్దపల్లి

పెద్దపల్లి