
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
జూలపల్లి(పెద్దపల్లి): అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్ కుమార్ అన్నారు. అబ్బాపూర్‌లోని 18 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంగళవారం ఆయన మంజూరు పత్రాలు ఆందజేసి మాట్లాడారు. విడతల వారీగా అర్హులకు ఇందిరమ్మ ఇ ళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. గతప్రభు త్వం పదేళ్లలో ఒక్క ఇంటిని కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. ఎంపీడీవో పద్మజ, తహసీల్దార్ స్వర్ణ, జూలపల్లి, ధర్మారం ఏఎంసీ చైర్మన్లు గండు సంజీవ్, రుప్లానాయక్,, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మర్యాదగా వ్యవహరించాలి
పాలకుర్తి(రామగుండం): ఫిర్యాదుదారులు, ప్ర జలతో మర్యాదగా వ్యవహరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. బసంత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌ను సీ పీ మంగళవారం తనిఖీ చేశారు. ఠాణా ఆవరణలో మొక్క నాటారు. ఆయన మాట్లాడుతూ, వృద్ధులను దూషించేవారు, నేరాలు చేసే మైనర్లపై నమోదు చేసే కేసులు, చట్టాలు ఎలా ఉంటున్నాయని ఎస్సై స్వామిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహిళా సిబ్బంది సీపీని శాలువాతో సత్కరించారు. డీసీపీ కరుణాకర్, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై స్వామి ఉన్నారు.
ప్రశాంతంగా జరుపుకోవాలి
పెద్దపల్లిరూరల్/ఓదెల: వినాయకచవితి పర్వదినాన్ని జిల్లావాసులు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎమ్మెల్యే విజయరమణారావు కోరారు. పెద్దపల్లి బల్దియా చేపట్టిన మ ట్టి గణపతుల విగ్రహాలను మంగళవారం ఆ యన పంపిణీ చేశారు. ఓదెల మండలం బా యమ్మపల్లె, అబ్బిడిపల్లి గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలోనే గ్రామపంచాతీలకు పక్కా భవనాలు నిర్మిస్తోందని తెలిపారు. పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, ఏఎంసీ చైర్‌పర్సన్ స్వరూప, ఏఈ సతీశ్ పాల్గొన్నారు.
నీట్ తరగతులు నిర్వహించాలి
జూలపల్లి(పెద్దపల్లి): ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు నీట్ తరగతులు నిర్వహించాలని ఇంటర్ బోర్డు ప్రత్యేకాధికారి రమణారావు సూచించారు. స్థానిక ప్రభుత్వ జూనియ ర్ కళాశాలను ఆయన మంగళశారం తనిఖీ చే శారు. అధ్యాపకులు, విద్యార్థులతో సమావేశం నిర్వహించి బోధన తీరుపై సూచనలు చేశారు. ప్రిన్సిపాల్ విశ్వప్రసాద్ పాల్గొన్నారు.
మండపాలకు ఉచిత విద్యుత్
సుల్తానాబాద్(పెద్దపల్లి): వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణపతి మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్ర భు త్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకో సం నిర్వాహకులు రిజిస్ట్రేషన్ స్లిప్పులు, ఖర్చు వి వరాలు సమర్పించాలి. సంతకం చేసిన ప్రొఫార్మను విద్యుత్ శాఖ అధికారులకు అందించాలి. సమస్యలు ఎదురైతే డయల్ 100 నంబరుతోపాటు రామగుండం పోలీస్ కమిషనరేట్‌లోని 87126 56597 నంబరులో సంప్రదించాలి.
యూరియా కొరత లేదు
జూలపల్లి(పెద్దపల్లి): జిల్లాలో యూరియా కొ రత లేదని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్ తెలిపారు. స్థానిక పీఏసీఎస్‌లో కొనసాగుతున్న యూరియా పంపిణీ ప్రక్రియను ఆయన మంగళవారం పరిశీలించారు. గతేడాదికన్నా ఈసా రి 2,960 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అధికంగా అందించామన్నారు. ముందు గా కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడంతోనే చి న్న, సన్నకారు రైతులకు సకాలంలో అదడం లే దని తెలిపారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ సెప్టెంబరు 3న ప్రారంభమైతే యూరియా కొరత తీరుతుంద ని వివరించారు. ఆయన వెంట వ్యవసాయాధికారులు శ్రీనాఽథ్, ప్రత్యూష పాల్గొన్నారు.
22 మంది వైద్యుల బదిలీ
గోదావరిఖని: సింగరేణిలో 22 మంది డాక్టర్లు బదిలీ అయ్యారు. ఈమేరకు ఉత్తర్వులిచ్చారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు