
నైపుణ్యం.. పర్యావరణ హితం
జ్యోతినగర్(రామగుండం)/మంథనిరూరల్: చిట్టి చేతులు మట్టి వినాయక విగ్రహాలను తయారు చేస్తూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందిస్తూ ప్రకృతి ప్రేమికుల మనసు దోచుకుంటున్నాయి. ప్రధానంగా ఎన్టీపీసీ దుర్గయ్యపల్లె, ఎల్కలపల్లిగేట్ ప్రభుత్వ పాఠశాలలతోపాటు మంథని మండలం ఆరెంద, గుంజపడుగు, చిన్నఓదాల సర్కారు బడుల విద్యార్థులు చక్కటి ఆలోచనతో మట్టి వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. కుల, మతాలకు అతీతంగా మట్టి విగ్రహాల తయారీతోపాటు వివిధ రంగులు అద్దుతూ అందంగా తయారు చేస్తున్నారు. స్థానికులు, పల్లెవాసులకు పంపిణీ చే స్తూ ఉదారత చాటుకుంటున్నారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో వీరుముందుకు వెళ్తున్నారు.
మట్టి విగ్రహాలతో గుంజపడుగు స్కూల్ విద్యార్థులు
టీచర్‌కు మట్టి విగ్రహం అందిస్తున్న చిన్నారులు

నైపుణ్యం.. పర్యావరణ హితం