
వరి పంట నీటమునిగింది
నాకున్న రెండున్నర ఎకరాల్లో వరి సాగు చేసిన. ఎకరాకు రూ.35 వేల దాకా పెట్టుబడి పెట్టిన. భారీ వర్షాలతో గోదావరికి వరద వచ్చింది. వరదనీరు మా పొలాలను ముంచేసింది. నాకున్న రెండున్నర ఎకరాలతోపాటు సమీపంలోని రైతుల వరి వరదనీటిలో మునిగి అక్కరకురాకుండా పోయింది. – బోగిరి లక్ష్మణ్, రైతు, పోతారం
ప్రభుత్వమే ఆదుకోవాలె
నాకున్న రెండెకరాలతోపాటు మూడెకరాలు కౌలుకు తీసుకుని వరి, పత్తి ఏసిన. పంటలు మంచిగా పెరిగినయ్. గోదావరికి వరదలు వచ్చి నది తీరంలోని పంటలు మునిగిపోయినయ్. ఎకరంన్నర పత్తి నీళ్లలో మునిగి నల్లగా మారింది. ప్రభుత్వమే ముందుకువచ్చి సాయం చేయాలె.
– బోగిరి భాస్కర్, రైతు పోతారం
30 ఎకరాల్లో పత్తికి నష్టం
గోదావరి వరదలతో నదీతీరంలోని సుమారు 30ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది. మరో వంద ఎకరాల వరకు వరనీటిలో మునిగింది. గోదావరి నది పరీవాహక ప్రాంతంలో ఒకేవైపు నుంచి పంటల మీదుగా వరద పోయింది. మా వ్యవసాయ శాఖ అధికారులు దెబ్బతిన్న పంటలను ఇటీవల సర్వే చేశారు. ప్రభుత్వం ఆదేశాలిస్తే నివేదిక సమర్పించి బాధిత రైతులకు పరిహారం అందజేస్తాం.
– అంజనీమిశ్రా, ఏడీఏ, మంథని

వరి పంట నీటమునిగింది