
రైతు సంక్షేమాన్ని పట్టించుకోని కాంగ్రెస్ సర్కార్
పెద్దపల్లిరూరల్: కాంగ్రెస్ సర్కార్ రైతు సంక్షేమా న్ని విస్మరిస్తోందని బీజేపీ నాయకులు విమర్శించా రు. జిల్లా కేంద్రంలో సోమవారం పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు పెంజర్ల రాకేశ్, వేల్పుల రమేశ్ ఆ ధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట బైఠాయించారు. నాయకులు మా ట్లాడుతూ, పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదని, సన్నరకం ధాన్యానికి బోనస్ చెల్లించడం లేదన్నారు. ఇలాంటి రైతు సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. సన్నరకం ధాన్యానికి బోనస్ చెల్లించడంలో జాప్యమెందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. నాయకులు తంగెడ రాజేశ్వర్‌రావు, పోల్సాని సంపత్‌రావు, శ్రీనివాస్, ఈర్ల శంకర్, తి రుపతి, మల్లయ్య, శివయ్య, శ్రీధర్, ఉమేశ్, సతీశ్, కృష్ణమోహన్, రేండ్ల వేణు, అంజి, కుమార్, రాజేంద్రప్రసాద్, సతీశ్, రాజు, స్వామి, రవి పాల్గొన్నారు.