
బంగారు చికిత
● ఆర్చరీ వరల్డ్ యూత్ గేమ్స్‌లో పసిడి పతకం సొంతం
కరీంనగర్‌స్పోర్ట్స్/ఎలిగేడు: షాంఘైలో జరిగిన ప్రపంచకప్ ఆర్చ రీ స్టేజ్–2 పోటీల్లో రజ తం, బ్యాంకాక్ ఏషియాడ్‌లో కాంస్యం, ఉత్తరాఖండ్ జాతీయ క్రీడల్లో కాంస్యం.. ఇలా తను పాల్గొన్న ప్రతీ ఈవెంట్‌లో ఏదో ఒక పతకంతో సత్తా చాటుతోంది చికిత. సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన తా నిపర్తి చికిత కెనడాలోని వెన్నిపెగ్‌లో జరుగుతున్న వరల్డ్ యూత్ ఆర్చరీ చాంపియన్‌షిప్ పోటీల్లో బంగారు పతకం సాధించింది. ఆదివారం కొరియా క్రీ డాకారిణి పార్క్ యరీన్‌తో జరిగిన ఫైనల్ పోరులో 142–136 పాయింట్ల తేడాతో ఓడించింది. హ హ రియాణాలోని సోనిపట్‌లో శిక్షణ పొందుతున్న చికి త .. ప్రస్తుతం పసిడి పతకం సాధించడంతో తల్లిదండ్రులు శ్రీనివాస్‌రావు, శ్రీలత ఆనందం వ్యక్తం చేశారు.