నేడు ఓదెలకు మంత్రుల రాక | - | Sakshi
Sakshi News home page

నేడు ఓదెలకు మంత్రుల రాక

Aug 25 2025 8:58 AM | Updated on Aug 25 2025 8:58 AM

నేడు

నేడు ఓదెలకు మంత్రుల రాక

ఓదెల(పెద్దపల్లి): దేవాదాయ, ధర్మాదాయ శా ఖ మంత్రి కొండా సురేఖ, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ సోమ వారం ఓదెల శ్రీమల్లికార్జునస్వామి సన్నిధికి చే రుకుంటారు. ఓదెల మల్లికార్జునస్వామి ఆల య చైర్మన్‌గా చీకట్ల మొండయ్యతోపాటు 11 మంది డైరెక్టర్లు పదవీప్రమాణ స్వీకారం చేయనుండగా.. ఈ కార్యక్రమానికి మంత్రులు హాజరవుతారు. ఈ సందర్భంగా ఆలయాన్ని ము స్తాబు చేశారు. ఆలయ అభివృద్ధి, భక్తుల విడి ది కోసం అదనపు గదులు, గుడి చుట్టూ సీసీ రోడ్డు నిర్మాణం, అవసరమైన స్థలం కొనుగో లు తదితర సమస్యలను మంత్రులకు విన్నవించేందుకు పాలకవర్గం సిద్ధమవుతోంది.

‘పోలీసుల తీరు సరికాదు’

పెద్దపల్లిరూరల్‌: కేంద్రంప్రభుత్వం అమలు చే స్తున్న ఆపరేషన్‌ కగార్‌కు వ్యతిరేకంగా వరంగల్‌లో చేపట్టిన ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక బహిరంగ సభకు పోలీసులు అ నుమతి నిరాకరించడం సరికాదని ప్రజాసంఘాల నాయకులు అన్నారు. సభకు వెళ్లకుండా ప్రజాసంఘాల నేతలను అరెస్టు చేయడం శోచనీయమన్నారు. ఈమేరకు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బొంకూరి లక్ష్మణ్‌, ఆదివాసీ హక్కుల పో రాట సంఘం కన్వీనర్‌ మల్లన్న తదితరులు స్థా నిక అమరవీరుల స్తూపం ఎదుట నిరసన తెలి పారు. ప్రజాప్రభుత్వమని చెబుతున్న కాంగ్రెస్‌ పాలకులు సమావేశాలు పెట్టుకునే స్వేచ్ఛ హ రించండం ఏమిటని నిలదీశారు. నాయకులు కుమారస్వామి, జ్యోతి, శుభాన్‌, దేవిసత్యం, జైపాల్‌సింగ్‌, బాలసాని రాజయ్య, పులిపాక రవీందర్‌, రత్నకుమార్‌, వినోద్‌, శంకర్‌ గుమ్మడి కొమురయ్య, గాండ్ల మల్లేశం, ఎరుకల రాజన్న తదితరులు పాల్గొన్నారు.

బోనస్‌ కోసం ఆందోళన

పాలకుర్తి(రామగుండం): బసంత్‌నగర్‌ అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కంపెనీ మైన్స్‌ ఓబీ కాంట్రాక్ట్‌ సంస్థ జననీలో విధులు నిర్వర్తించే లారీడ్రైవర్లు ఆ దివారం కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఐదేళ్లుగా పనిచేస్తున్నా దీపావళి బో నస్‌ చెల్లించడం లేదన్నారు. కాంట్రాక్ట్‌ సంస్థ గడువు ముగియడంతో నాలుగు నెలలుగా పనుల్లేక, చేతిలో చిల్లిగవ్వలేక దుర్భర జీవితం అనుభవిస్తున్నామని ఆవేదన చెందారు. ఈమేరకు చేతిలో పురుగులమందు, పెట్రోలు సీసా లతో సంస్థ క్యాంపు ఆవరణలో బైఠాయించా రు. సమాచారం అందుకున్న కంపెనీ సెక్యూ రిటీ అధికారి రవీందర్‌రెడ్డి, గుర్తింపు కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి దాడి మహేశ్‌ సంఘటన స్థలానికి చేరుకుని డ్రైవర్లతో చర్చించా రు. కాంట్రాక్టు సంస్థతో చర్చించి 15రోజుల్లో గా డబ్బు చెల్లించేలా కృషి చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ఆందోళన విరమించారు.

వర్తక సంఘం కార్యవర్గం

పెద్దపల్లిరూరల్‌: వెండి, బంగారు వర్తక సంఘం ప ట్టణ అధ్యక్షుడిగా రంగు శ్రీనివాస్‌ ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలోని స్వర్ణకా ర సంఘ భవనంలో జరి గిన ఎన్నికల్లో 20 ఓట్ల మె జార్టీతో రంగు శ్రీనివాస్‌ తన ప్రత్యర్థి కట్ట సదానందంపై విజయం సాధించారు. రంగు శ్రీనివాస్‌కు 55ఓట్లు పోల్‌ కాగా, కట్ట సదానందంకు 35 ఓట్లు పోలయ్యాయని ఎన్నికల అధి కారులు ప్రకటించారు. సంఘం సభ్యుల సమస్యల పరిష్కారానికి సహకారం అందిస్తానని అధ్యక్షుడిగా ఎన్నికై న శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

సమస్యలపై ఉద్యమం

గోదావరిఖని: కార్మికుల సమస్యలపై దశలవా రీ ఉద్యమానికి సిద్ధమయ్యామని టీబీజీకేఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాదాసు రామమూర్తి అ న్నారు. స్థానిక యూనియన్‌ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలు యాజమాన్యాని కి వత్తాసు పలుకుతున్నాయని విమర్శించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో ఈనెల 28న బొగ్గు గనులపై నల్లబ్యాడ్జీలు ధరించి, 29న జీఎంలకు వినతిపత్రాలు సమర్పిస్తామని, వచ్చేనెల 2న కొత్తగూడెంలో ధర్నా చేస్తామని పేర్కొన్నారు. పర్లపల్లి రవి, వడ్డేపల్లి శంకర్‌, జావిద్‌ పాషా, సతీశ్‌ పాల్గొన్నారు.

నేడు ఓదెలకు మంత్రుల రాక 1
1/3

నేడు ఓదెలకు మంత్రుల రాక

నేడు ఓదెలకు మంత్రుల రాక 2
2/3

నేడు ఓదెలకు మంత్రుల రాక

నేడు ఓదెలకు మంత్రుల రాక 3
3/3

నేడు ఓదెలకు మంత్రుల రాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement