
కష్టాలను తెలుసుకునేందుకే జనహిత యాత్ర
పదేళ్లలో బీఆర్‌ఎస్ చేసిందేమీ లేదు దేవుడి పేరుతో బీజేపీ రాజకీయాలు జనహిత పాదయాత్రలో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ రోల్‌మోడల్‌గా చొప్పదండి: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఉత్సాహంగా సాగిన పాదయాత్ర
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/గంగాధర: ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకునేందుకు, ప్రజల క ష్టసుఖాల్లో పాలుపంచుకునేందుకు జనహిత పాదయాత్ర చేపట్టామని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఆదివారం చొప్పదండి నియోజకవర్గంలో చేపట్టిన జనహితయాత్రలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో కలిసి పాల్గొన్నారు. గంగాధర మండలం ఉప్పర మల్యాల నుంచి గంగాధర మధురానగర్ చౌరస్తా వరకు పా దయాత్ర సాగింది. మధురానగర్ చౌరస్తాలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి స త్యం, రాజ్‌ఠాకూర్, మాజీ ఎంపీ వీహెచ్, మాజీ ఎ మ్మెల్సీ జీవన్‌రెడ్డి తదితరులతో కలిసి మహేశ్‌కుమా ర్‌గౌడ్ ప్రసంగించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లపై దు మ్మెత్తి పోశారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి ఇదే గంగాధరలో విజయోత్సవాలు చేసుకుందామన్నారు.
రోల్‌మోడల్‌గా చొప్పదండి: ఎమ్మెల్యే సత్యం
సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల సహకారంతో చొప్పదండ నియోజకవర్గాన్ని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. పదేళ్ల పాలనలో ఒక్క ఇళ్లు ఇవ్వలేదని, కాంగ్రెస్ అ ధికారంలోకి రాగానే ప్రతీగ్రామానికి ఇందిరమ్మ ఇ ళ్లు ఇచ్చిందన్నారు. చురుగ్గా నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. తొమ్మిది రోజుల్లో రూ.9వేలకోట్ల రైతుభరోసా విడుదల చేశామన్నారు. రూ.21వేల కోట్ల రుణమాఫీ చేశామని, 60వేల ఉద్యోగాలు, అ ర్హులందరికీ రేషన్‌కార్డులు, కార్డులున్న వారికి సన్న బియ్యం ఇస్తున్న ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో నియోజకవర్గంలో అదనంగా చు క్కనీరు ఇవ్వలేదన్నారు. ఎవరు అడ్డుపడినా అభివృద్ధి ఆగదన్నారు. నారాయణపూర్ రిజర్వాయర్ కట్ట ఎత్తు పెంచి, నిర్వాసితులకు పరిహారంతో పాటు వ్యవసాయానికి నీరు అందిస్తామన్నారు. త్వరలోనే గంగాధరలో డిగ్రీ కళాశాల మంజూరు చేస్తానన్నారు. కొండగట్టు అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తానన్నారు. ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు అయిందని తెలిపారు.
ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం
మండలంలోని కురిక్యాలలో ఇందిరమ్మ ఇల్లు పథకంలో బాలగోని భాగ్య– గంగయ్య దంపతులు నిర్మించుకున్న ఇంటిని పాదయాత్రలో భాగంగా మీనాక్షి నటరాజన్‌తో పాటు మంత్రులు గృహ ప్రవేశం చేశారు. సొంత ఇల్లు కట్టుకున్నందుకు సంతోషంగా ఉందని, పదేళ్లుగా రేషన్ కార్డు రాలేదని, కాంగ్రెస్ వచ్చాక రేషన్ కార్డు వచ్చిందని భాగ్య దంపతులు భావోద్వేగంతో కంటితడి పెట్టారు.