
సీసీ కెమెరాలు.. జియో ట్యాగింగ్
గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వా తావరణంలో జరుపుకునేలా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. మండప నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ శాఖ అనుమతి తీసుకోవాలని, ఇందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయా లని సూచిస్తోంది. ప్రతీమండపంలో సీసీ కెమెరా లు ఏర్పాటు చేయడం తప్పనిసరి చేసింది. ఈనె ల 27న ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
మతపెద్దలతో శాంతి కమిటీ సమావేశం
పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీసు అధికారు లు, మతపెద్దలతో సీపీ అంబర్ కిశోర్ ఝా ఇటీవల శాంతి సమావేశం నిర్వహించారు. వినాయ క నవరాత్రి ఉత్సవాలు, మిలాన్ ఉన్ నబీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ఇందుకోసం సహకరించాలని సూచించారు.
గతేడాది 4,786 విగ్రహాల ఏర్పాటు
గతేడాది రామగుండం పోలీస్ కమిషనరేట్ పరి ధిలో 4,786 గణపతి విగ్రహాలు ఏర్పాటు చేశా రు. ఈసారి వాటి సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, గణేశ్ మండపాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, ప్రతీ విగ్రహానికి జియోట్యాగింగ్ చేసి నవరాత్రి ఉత్సవాలు ప్ర శాంతంగా జరిగేలా పోలీస్‌లు పక్కాగా నిఘా ఉంచుతారు. నిమజ్జన వేడుకలు సాఫీగా సాగేందుకు ఈ ప్రక్రియ ఎంతోదోహదం చేస్తుందని పో లీస్ అధికారులు చెబుతున్నారు. మరోవైపు.. ఎ లాంటి సమస్యలు ఎదురైనా, సమాచారం కోసమైనా డయల్ 100 నంబరుతోపాటు రామగుండం పోలీస్ కమిషరేట్ కంట్రోల్ రూం 87126 56597 నంబరుతోపాటు పోలీసులను సంప్రదించాలని సూచిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి నిరంతరం నిఘా ఉంచుతారు.