
ఎన్టీపీసీ ఉద్యోగులకు అండగా ఐఎన్‌టీయూసీ
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ ఉద్యోగులకు ఐఎన్‌టీయూసీ అండగా ఉంటుందని ఎన్బీసీ సభ్యు డు, యూనియన్ జాతీయ సీరియర్ కార్యదర్శి బా బర్ సలీంపాషా అన్నారు. పీటీఎస్‌లో 8వ ఆల్ ఇండియా ఎన్టీపీసీ వర్కర్స్ ఫెడరేషన్ వర్కింగ్ కమిటీ ముగింపు సమావేశం ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, ఎన్టీపీసీ ఉద్యోగుల అభ్యున్నతికి ఐఎన్‌టీయూసీ కృషి చేస్తుందన్నారు. అనంతరం పలు తీర్మానాలు చేశారు. ఉద్యోగ గుర్తింపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల కృష్ణయ్య, ఆ రెపల్లి రాజేశ్వర్, చంద్రవంశీ తదితరులు ఉన్నారు.