
ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి
జ్యోతినగర్(రామగుండం): మావోయిస్టుల ఏరివేత పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌ను తక్షణమే నిలిపివేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమన్వయకర్త ముడిమడుగుల మల్లన్న, సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకుడు దుర్గం నగేశ్, పౌర హక్కుల సంఘం నాయకులు వినోద్, రత్నకుమార్ డిమాండ్ చేశారు. స్థానిక న్యూ పోరట్‌పల్లిలో ఆదివాసీ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు సోయం జనార్దన్ అధ్యక్షతన శనివారం సమావేశం నిర్వహించారు. ఆపరేషన్ కగార్‌కు నిరసనగా ఈ నెల 24న వరంగల్‌లో నిర్వహించే సభ ప్రచార పోస్టర్‌ను ఈ సందర్భంగా విడుదల చేసి మాట్లాడారు. నాయకులు ఆత్రం చంద్రయ్య, భూమయ్య, రమేశ్, హరీశ్ పాల్గొన్నారు.
ఎన్టీపీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ ఉద్యోగ గుర్తింపు సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తూ యాజమాన్యం ఉత్తర్వులను జారీచేసింది. ఎన్‌బీసీ ప్రతినిధి, యూనియన్ మూడేళ్ల పదవీకాలం సెప్టెంబర్ 2025తో ముగుస్తుంది. ఈ క్రమంలో ఎన్టీపీసీ రామగుండం – తెలంగాణ ప్రాజెక్టు నుంచి ప్రతినిధులను ఎన్నుకోవడానికి సెప్టెంబర్ 25న పోలింగ్ నిర్వహిస్తారు. ఈమేరకు సదరన్ రీజియన్ హెడ్ క్వార్టర్(ఎస్‌ఆర్‌హెచ్‌క్యూ) సీజీఎం(హెచ్‌ఆర్), ముఖ్య ఎన్నికల అధికారి సూర్యనారాయణ పాణిగ్రాహి ఉత్తర్వులను జారీ చేశారు.
26న అవగాహన సదస్సు
పెద్దపల్లిరూరల్: విదేశాల్లో ఉపాధి అవకాశాలు పొందేందుకు అనుసరించాల్సిన పద్ధతులపై ఈనెల 26న కలెక్టరేట్‌లో అవగాహన సదస్సు నిర్వహిస్తామని జిల్లా పరిశ్రమల అధికారి కీర్తికాంత్ తెలిపారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) ద్వారా సు రక్షితమైన విదేశీ ఉపాధి అవకాశాలను చట్టబద్ధంగా కల్పిస్తామన్నారు. విదేశీ నియామకదారులతో సమన్వయ పరిచి డాక్యుమెంటేషన్, శి క్షణ, ప్లేస్‌మెంట్ వంటి సదుపాయాలు అందిస్తామన్నారు. జపాన్, ఇజ్రాయిల్, జర్మనీ, పో ర్చుగల్, యూఏఈలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, ఆసక్తి, అర్హత గలవారు ఈనెల 26న సదస్సుకు హాజరై సందేహాలు నివృత్తి చేసుకోవాలన్నారు.

ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి