
కేంద్రం నిర్లక్ష్యంతోనే యూరియా కొరత
● ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉత్పత్తి నిలిచిపోయినా ఎందుకు స్పందించడం లేదు?● పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు
సుల్తానాబాద్(పెద్దపల్లి): కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతోనే యూరియా కొరత ఏర్పడుతోందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నా రు. స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల స మావేశంలో మాట్లాడారు. సాంకేతిక లోపంతో ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో సుమారు 90 రోజులుగా యూరియా ఉత్పత్తి కావడం లేదని, సాంకేతిక నిపుణులతో సరిచేయాల్సిన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవ హరించడంతోనే సమస్య ఎదురవుతోందన్నారు. కేంద్రమంత్రులు బండి సంజయ్ కుమార్, కిషన్‌రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. జిల్లాలో శనివారం వరకు 2.50 లక్ష ల ఎకరాల్లో వరి సాగు చేశారని, ఇందుకోసం 21, 581 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని, ఇ ప్పటివరకు 19 వేల మెట్రిక్ టన్నులే సరఫరా చేశా రని అన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష చొరవతో కొర త తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయ న అన్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రైతులపై చిత్తశుద్ధి ఉంటే కేంద్రమంత్రి నడ్డా వద్దకు వెళ్లి యూరియా కేటాయించేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంతటి అన్నయ్యగౌడ్, మినుపాల ప్రకాశ్‌రావు, శ్రీగిరి శ్రీనివాస్, సాయిరి మహేందర్, కల్లేపల్లి జానీ, దామోదర్‌రావు, అబ్బయ్యగౌడ్, చిలుక సతీశ్, గాజుల రాజమల్లు, పన్నాల రాములు, అమిరిశెట్టి రాజలింగం, తిరుపతి, ముస్త్యాల రవీందర్, విజయభాస్కర్‌రెడ్డి, రఫిక్, రాజన్న, గోపాల్, రవీందర్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.