
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
● జిల్లా జడ్జి, లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి స్వప్నరాణి
సుల్తానాబాద్(పెద్దపల్లి): ప్రతీవిద్యార్థి చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి, జిల్లా జడ్జి స్వప్నరాణి సూచించారు. పట్టణంలోని అల్ఫోర్స్ పాఠశాలలో శనివారం చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. జడ్జి మాట్లాడుతూ, ఉన్నత న్యాయస్థానాలు అందరికీ న్యాయం జరగాలన్న ఉద్దేశంతో అన్నికోర్టుల్లో లీగల్ సర్వీసెస్ అథారిటీలు ఏర్పాటు చేశాయన్నారు. వాటి ద్వారా న్యాయవిజ్ఞాన సదస్సులు నిర్వహిస్తూ చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. అన్యాయం జరిగిన వెంటనే లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదిస్తే ఉచితంగా న్యాయం అందిస్తారని తెలిపారు. కొందరి స్వార్థం కోసం యువతను చెడుమార్గాల్లో నడిపిస్తున్నారని, విద్యార్థులు, యువత వాటికి దూరంగా ఉండాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడపరాదని అన్నారు. వాహనాల చట్టం, సోషల్ మీడియా, సైబర్ క్రైమ్ తదితర చట్టాలపై న్యాయవాదులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో న్యాయవాదులు టి.నరేశ్ పటేల్, ఆర్.ఝాన్సీ, శరత్‌తోపాటు ప్రిన్సి పాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.