
విక్రయాలకు కేరాఫ్
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్, రేకుర్తి, కొత్తపల్లి, చింతకుంట పరిసర ప్రాంతాల్లో తయారవుతున్న వినాయక విగ్రహాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తరలుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో సుమారు 40 దుకాణాల్లో గణేశుని విగ్రహాలను తయారు చేస్తున్నారు. సుమారు 300 మంది ప్రత్యక్షంగా, మరో 300 మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. రాజస్థాన్‌కు చెందిన కార్మికులు విగ్రహాల తయారీలో నిష్ణాతులు కాగా.. స్థానిక కార్మికులు కలరింగ్, అద్దకం పనుల్లో పాల్పంచుకుంటున్నారు. సుమారు రూ.20 వేల నుంచి రూ.లక్ష విలువ చేసే విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్‌ను బట్టి ప్రతిమలను కొనుగోలు చేస్తున్నారు. మరికొంతమంది నచ్చిన ప్రతిమలకు అడ్వాన్స్ రూపంలో చెల్లిస్తూ రిజర్వ్ చేసుకుంటున్నారు. మట్టి వినాయకులపై అవగాహన పెరగడంతో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ప్రతిమలకు గిరాకీ తగ్గిందని చెబుతున్నారు.