
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
రామగిరి(మంథని): పంచాయతీ కార్యదర్శులు విధి నిర్వహణలో పొరపాట్లు చోటుచేసుకోకుండా చూసుకోవాలని డీపీవో వీరబుచ్చయ్య సూచించా రు. పన్నూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం ఆయన కార్యదర్శులతో వివిధ అంశాలపై సమీక్షించారు. పారిశుధ్య పనులు సమర్థవంతంగా నిర్వహించాలని, చెత్తను సెగ్రిగేషన్‌కు తరలించి కంపోస్ట్ ఎరువు తయారుచేయాలన్నారు. తాగునీటి పైపులైన్ లీకేజీలకు వెంటనే మరమ్మతు చేయాలని, వృత్తి, వ్యాపార లైసెన్స్‌లు, ఇంటి నిర్మాణ అనుమతులు సకాలంలో మంజూరు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఓటరు జాబితా పరిశీలించాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శైలజారాణి, ఎంపీవో ఉమేశ్, ఈ పంచాయతీ ఆపరేటర్లు వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.