
స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో..
సిరిసిల్లటౌన్: సిరిసిల్లలో అత్యధికశాతం ఉండే పద్మశాలి సామాజికవర్గం వారే తొలిసారిగా గణపతి ఉత్సవాలను నిర్వహించారు. స్థానిక గాంధీచౌక్‌లో అప్పటి పుర ప్రముఖులు రుద్ర శంకరయ్య, మడూరి అంబాజి, భీమనాఽథిని నారాయణ, కుడిక్యాల రాజారాం, ఎలగొండ నారాయణ సమాజ సేవా సంఘాన్ని ఏర్పాటు చేసి మొదటి గణపతిని ప్రతిష్ఠించారు. 1947 నుంచి ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం స్థానిక మార్కండేయ భవనంలో 79వ వినాయక చవితి ఉత్సవాలు జరిపేందుకు సిద్ధమయ్యారు. అధ్యక్షుడిగా గోలి వెంకటరమణ కొనసాగుతున్నారు. సిరిసిల్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో 1948 నుంచి వినాయక నవరాత్రులు నిర్వహిస్తున్నారు. తొలితరంలో గాండ్ల వీరయ్య నేతృత్వంలో సంఘాన్ని స్థాపించారు. ఈ ఏడాదితో 78వ వార్షికోత్సవం జరుపుతున్న వర్తక సంఘానికి ప్రస్తుతం పుల్లూరి వేణు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.