
విద్యాబోధనపై దృష్టి
● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి రూరల్: విద్యా బోధనపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉపాధ్యాయులకు సూచించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం విద్యాశాఖపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలల్లో కనీస విద్యా ప్రమాణాలు పెంపు లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. అయినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడంలేదని తెలిపారు. జిల్లా విద్యాఽ శాఖాధికారి మాధవి, అధికారులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలి
జూలపల్లి(పెద్దపల్లి): భూభారతి నిబంధనల ప్రకారం భూసమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. అదనపు కలెక్టర్ వేణుతో కలిసి ఆయన రెవెన్యూ సమస్యలపై సమీక్షించారు. కార్యక్రమంలో ఆర్డీవోలు గంగయ్య, సురేశ్, ఏడీ సర్వే ల్యాండ్ రికార్‌ుడ్స శ్రీనివాస్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
పెద్దపల్లి రూరల్: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఉన్నత చదువుల కోసం ఆర్థికసాయం అవసరమైన వారు ఈనెల 31లోగా దరఖస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి వినోద్‌కుమార్ సూచించారు. అమెరికా, జర్మనీ, న్యూజీలాండ్, జపాన్, సింగపూర్, సౌత్‌కొరియా తదితర దేశాల్లో పీజీ చదివేందుకు ప్రభుత్వం సాయం చే స్తుందన్నారు. ఆసక్తి, అర్హత గలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.