
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష
ధర్మారం(ధర్మపురి): అవసరం మేరకు యూరి యా కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్షత చూపుతోందని మంత్రి లక్ష్మణ్‌కుమార్ ఆరోపించారు. స్థానిక ప్రాథమిక పాఠశాల ఆవరణలో అంగన్‌వాడీ భవనం, కేజీబీవీలో డా ర్మెటరీ గదుల నిర్మాణానికి మంత్రి శుక్రవారం భూమిపూజ చేశారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులు భోజనం పరిశీలించారు. దొడ్దు బియ్యంతో కూడిన అన్నం పెట్టడడంతో సివిల్ సప్లయ్ అ ధికారికి ఫోన్‌చేసి ఆగ్రహం వ్యక్తంచేశారు. సన్నబియ్యంతో కూడిన భోజనం వడ్డించాలని, ఇందుకోసం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయాలని మంత్రి సూచించారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ రైతుల సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. కాగా, పత్తిపాక సింగిల్‌విండో చైర్మన్ నో ముల వెంకటరెడ్డి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సమక్షంలో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చే రారు. నాయకులు రూప్లానాయక్, అరిగే లింగయ్య, యశోద అజయ్, గాగిరెడ్డి తి రుపతిరెడ్డి, సోగాల తిరుపతి, కొత్త నర్సింహు లు, కాడే సూ ర్యనారాయణ, పాలకుర్తి రాజేశంగౌడ్, కొడారి అంజన్న, అధికారులు ప్రవీణ్‌కుమార్, ఉదయ్‌కుమార్, ప్రభాకర్, వరలక్ష్మి పాల్గొన్నారు.