
గ్రామాల సమగ్రాభివృద్ధే కాంగ్రెస్ ధ్యేయం
రామగుండం: నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్ అన్నారు. అంతర్గాం మండలంలోని టీటీఎస్ అంతర్గాం, ముర్మూర్, గోలివాడలో ఆయన వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించి మాట్లాడారు. పాడి పరిశ్రమాభివృద్ధి చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి, తహసీల్దార్ రవీందర్‌పటేల్, ఎంపీడీవో వేణుమాధవ్, సీడీపీవో అలేఖ్య, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్ తతదితరులు ఉన్నారు.
మున్సిపల్ ఉద్యోగికి నివాళి
పోస్టాఫీస్ వీధిలో నివాసం ఉండే ఎమ్మెల్యే గురు వు మాదేశి నారాయణ కుమారుడు, మున్సిపల్ ఉద్యోగి శ్రీనివాస్ ప్రథమ వర్ధంతికి ఎమ్మెల్యే ఠాకూర్ హాజరై నివాళి అర్పించారు. మృతుడి సతీమణితోపాటు సోదరులు శివ, హనుమాన్, వరప్రసాద్‌ను ఎమ్మెల్యే పరామర్శించారు.