ఓదెల: సంకోచ, వ్యాకోచాలతో రైలు ప్రమాదా లు జరగకుండా రైల్వేశాఖ శ్రీకారం చుట్టింది. కాజీపేట్ నుంచి బల్లార్షా సెక్షన్ల మధ్యలో కాజీ పేట్, జమ్మికుంట, ఓదెల, పొత్కపల్లి, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్ వరకు రైలుపట్టాలు మార్చుతున్నారు. సూపర్‌ఫాస్ట్, ప్రత్యేక రైళ్ల రాకపోకలకు అనుకూలంగా పట్టాలు మార్చుతున్నట్లు రైల్వేశాఖ సిబ్బంది పేర్కొన్నారు.
శాసీ్త్రయసాగుతో దిగుబడులు
కాల్వశ్రీరాంపూర్: సస్యరక్షణ చర్యలతో చీడపీడలను నివారించాలని, ఎరువు, నీటి యాజ మాన్యం, శాసీ్త్రయ వ్యవసాయ సాగు పద్ధతులతో అధిక దిగుబడులు పొందాలని కూనారం వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త సతీశ్‌చంద్ర, ఏవో నాగార్జున సూచించారు. గురువారం మండలంలోని గంగారం, కూనారం గ్రామాల్లో క్షేత్రపర్యటన చేసి రైతులకు సాగు పద్ధతులపై సూచనలు, సలహాలు చేశారు. అధిక వర్షాలతో పత్తి, మొక్కజొన్నకు చీడపీడలు వచ్చే అవకాశముందని, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వివిధ రకాల తెగుళ్లకు ఏ మందులు వాడాలో రైతులకు సూచించారు.
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
గోదావరిఖని: దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. గురువారం గోదావరిఖనిలో మాట్లాడుతూ దేశంలో ఎన్నికల కమిషన్ వైఫ ల్యం చెందిందని, బిహార్‌లో 60లక్షల ఓట్లను తీసివేసి బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఎన్నికలు జరిగేలా చేసిందన్నారు. పోలైన ఓట్లకు ఉన్న ఓట్లకు లక్షల సంఖ్యలో తేడాలు కనిపిస్తున్న నేపథ్యంలో భారత ఎన్నికల కమి షన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతులకు 15 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా కేంద్రం ఇప్పటివరకు 7లక్షల మెట్రిక్ టన్నులే కేటాయించిందన్నారు. కట్ట రమ, నంది రామయ్య, జూపాక శ్రీనివాస్, తోకల రమేశ్, జాడి దేవరాజ్, జిందం రాంప్రసాద్ పాల్గొన్నారు.
కేబుళ్లు తొలగించాలి
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణంలోని విద్యుత్ స్తంభాలకు అస్తవ్యస్తంగా అమర్చిన కేబుల్, ఇంటర్నెట్ వైర్లను తొలగించాలని ట్రాన్స్ కో ఏడీఈ రాజ్‌కుమార్ పేర్కొన్నారు. పట్టణంలోని పలు వీధుల్లో అడ్డంగా ఉన్న వైర్లను ఏఈలు శ్రీనివాస్, జగదీశ్‌తో కలిసి పరిశీలించారు. వినాయక నవరాత్రోత్సవాల సందర్భంగా విగ్రహాలను మండపాలకు తరలించడం, నిమజ్జనానికి తరలించే సమయాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. వీలైనంత త్వరగా వైర్లను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని, లేదంటే తామే ఇంటర్నెట్, కేబుల్ వైర్లను తొలగిస్తామని నిర్వాహకులను హెచ్చరించారు.
24న జిల్లాస్థాయి పోటీలు
జ్యోతినగర్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 24న ఎన్టీపీసీ రామగుండం జిల్లా పరిషత్ హైస్కూల్ క్రీడా మైదానంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్ష, కార్యదర్శులు కొలిపాక శ్రీనివా స్, కొమ్ము గట్టయ్య తెలిపారు. అండర్– 14, 16,18,20 బాల బాలికలకు ఎంపిక పోటీలు ఉంటాయని, ప్రతిభచూపిన 30మందిని మహబూబ్‌నగర్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు.

రైలు ప్రమాదాల నివారణకు చర్యలు

ప్రమాదంలో ప్రజాస్వామ్యం