పెద్దపల్లిరూరల్/కాల్వశ్రీరాంపూర్: ప్రతీ భూ సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌కు రావొద్దని, ఆర్డీవో స్థాయిలోనే పలు రకాల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. భూ సమస్యలున్న వారు కలెక్టరేట్‌కు వచ్చి వ్యయ, ప్రయాసలకు లోను కావొద్దన్నారు. మార్కెట్ విలువ రూ.5లక్షల కన్న తక్కువ ఉన్న మిస్సింగ్ సర్వేనంబర్ సమస్య ఆర్డీవో స్థాయిలోనే పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. భూ విస్తీర్ణ సవరణ, పట్టాదారు పాసుపుస్తకం డిజిటల్ సైన్, పట్టాధార్ పాసుపుస్తకంలో పేరు సవరణ, పెండింగ్ మ్యుటేషన్, పెండింగ్ సక్సేషన్, నాలా, కోర్టు, పీపీబీ, నాలా నుంచి వ్యవసాయ భూమిగా మార్చుకునేందుకు ఆర్డీవోలకే అధికారం ఉందని వివరించారు. ఇలాంటి సమస్యలున్న వారు ఆర్డీవో ఆఫీసులోనే పరిష్కరించుకోవాలని సూచించారు.
వసతులెలా ఉన్నాయి.
‘హాస్టల్‌లో వసతులెలా ఉన్నాయి. వార్డెన్ రెగ్యులర్ వస్తున్నారా. భోజనం రుచిగా ఇస్తున్నారా’.. అంటూ కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న బీసీ బాలికల వసతిగృహంలో ఉన్న విద్యార్థినులను అడిగి తెలుసుకున్నా రు. గురువారం ఉదయం హాస్టల్‌ను ఆకస్మికంగా సందర్శించి, అటెండెన్స్ రిజిస్టర్‌ను పరిశీలించారు. వార్డెన్ ఏ సమయంలో వస్తారరని ఆరా తీశారు. మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలన్నారు.
భూముల సందర్శన.. పాఠశాలల తనిఖీ
భూభారతి దరఖాస్తులు, భూ సమస్యల సత్వర పరిష్కారం దిశగా కలెక్టర్ కోయ శ్రీహర్ష కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం, ఇదులాపూర్, జాఫర్‌ఖాన్‌పేట గ్రామాల్లో గురువారం పర్యటించా రు. ఆయా గ్రామాల్లో ఆటవీ, సమస్యాత్మక భూములను పరిశీలించారు. ఇదులాపూర్‌లో మిస్సింగ్ సర్వే నంబర్ పట్టాకోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాఠశాలలో మధ్యా హ్న భోజనం, అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశా రు. మధ్యాహ్న భోజన వర్కర్ల సమస్యలు, మెనూ ప్రకారం వంట చేస్తున్నారా అని తెలుసుకున్నారు. విద్యార్థులతో పాఠాలు చదివించి, ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టారు. తహసీల్దార్ జగదీశ్వర్‌రావు, పీటీ శంకర్, సర్వేయర్ రాజు పాల్గొన్నారు.
ఆర్డీవో స్థాయిలోనే భూ సమస్యలు పరిష్కారం
కలెక్టర్ కోయ శ్రీహర్ష