
మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు
ధర్మారం: రామగుండం కమిషనరేట్ పరిధిలో మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ధర్మారం పోలీస్‌స్టేషన్‌ను గురువారం తనిఖీ చేశారు. సీపీకి ఎస్సై ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది పూలమొక్కను అందించి స్వాగతం పలికారు. పెండింగ్, కోర్టు, ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కేసుల రికార్డులను సీపీ తనిఖీ చేశారు. స్టేషన్‌పరిధిలో రౌడీషీటర్ల కదలికలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పక్క రాష్ట్రాల నుంచి మాదకద్రవ్యాల రవాణా జరుగుతోందని తెలిపారు. సదరు ప్రాంతాలను గుర్తించి సరిహద్దుల్లో నిఘా వ్యవస్థను పటిష్టం చేశామని స్పష్టం చేశారు. డ్రగ్స్ కంట్రోల్ కోసం ట్రాకింగ్ డాగ్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణలో జరుపుకోవాలని సూచించారు. మంటపాల ఏర్పాటులో తగు జాగ్రత్తలు తీసుకోవా లన్నారు. అనంతరం పోలీసుస్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, ఏసీపీ కృష్ణ, పెద్దపల్లి సీఐ ప్రవీణ్‌కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
వినాయక మండపాల్లో జాగ్రత్తలు అవసరం
రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా