
మల్లన్నకు లక్ష బిల్వార్చన
శ్రావణమాసం మాస శివరాత్రి సందర్భంగా ఓదెల మల్లికార్జునస్వామి ఆలయంలో గురువారం లక్షబిల్వార్చన పూజలు, స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం, భ్రమరాంబికా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. లక్షబిల్వార్చనలో 150మంది దంపతులు పాల్గొన్నారు. మల్లికార్జునస్వామి, భ్రమరాంభ అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. గర్భగుడిలో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేశారు. గోదావరిఖనికి చెందిన కన్నూరి రాయమల్లు– సుగుణ దంపతులు అన్నదానం చేశారు. ఈవో బి.సదయ్య, జూనియర్ అసిస్టెంట్ ముద్దసాని కుమారస్వామి ఏర్పాట్లను పర్యవేక్షించారు. – ఓదెల

మల్లన్నకు లక్ష బిల్వార్చన