
చాలామంది రిటైర్ అయ్యారు
15 ఏళ్ల నాటి పీఆర్పీ ఇప్పటికీ చెల్లించలేదు. చాలామంది పీఆర్పీ తీసుకోకుండానే రిటైర్డ్ కాగా మరికొందరు చనిపోయారు. కోర్టు తీర్పు ఇచ్చినా అమలు కావడం లేదు. – పెద్ది నర్సింహులు,
ప్రధాన కార్యదర్శి సీఎంవోఏఐ
పరిష్కారమయ్యే వరకూ పోరు
సమస్యలు పరిష్కారమయ్యేంత వరకూ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయి. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతలో అహర్నిశలు శ్రమిస్తున్న అధికారుల విషయంలో సింగరేణి ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. సీఎండీ, డైరెక్టర్ల దృష్టికి సమస్యలు తీసుకెళ్లి నా పరిష్కారం కాలేదు. ఆందోళనలు ఉధృతం చేసేందుకు ఈనెల 17న భూపాలపల్లి లో సమావేశమై కార్యాచరణ రచిస్తాం.
– టి.లక్ష్మీపతిగౌడ్, అధ్యక్షుడు, సీఎంవోఏఐ

చాలామంది రిటైర్ అయ్యారు