
గ్రీన్ ఎనర్జీ దిశగా అడుగులు
జ్యోతినగర్(పెద్దపల్లి): గ్రీన్ ఎనర్జీ విస్తరణదిశగా ఎన్టీపీసీ వేగంగా అడుగులు ముందుకు వేస్తోందని రామగుండం – తెలంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ) చందన్ కుమార్ సామంత అన్నారు. స్థానిక మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో జరిగిన స్వాంతత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వాతంత్య్ర సాధన కోసం పోరాడిన వారి త్యాగాలు, ధైర్యం, సంకల్పం గురించి అందరం గుర్తుచేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా దేశభక్తి గీతాల ప్రతిధ్వనులు, త్రివర్ణ పతాక రెపరెపలు ఆకట్టుకున్నాయి. ప్రతిభ కనభర్చిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను, బాలికలకు సైకిళ్లను అందించారు. దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సామంత, జనరల్ మేనేజర్లు, సీనియర్ అధికారులు, ఉద్యోగ గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి ఆరెపల్లి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.