
లక్ష్య సాధనలో ముందుండాలి
గోదావరిఖని: వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో ప్రతీఉద్యోగి ముందుండి సింగరేణి సంస్థ అభివృద్ధిలో పాలుపంచుకోవా లని ఆర్జీ – వన్ జీఎం లలిత్‌కుమార్ సూచించారు. జీఎం కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన జాతీయ జెండా ఎగురవేశారు. రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించి దేశప్రగతిలో మనవంతు కర్తవ్యం చాటాలని అన్నారు. ఓసీపీలు లాభాల బాటలో కొనసాగుతుండగా, భూగర్భ గనులు నష్టాల్లో ఉన్నాయని తెలిపారు. అధికారులు భైద్యా, రమేశ్, రవీందర్‌రెడ్డి, రమేశ్, శ్రీనివాస్, జితేందర్‌సింగ్, కర్ణ, వీరారెడ్డి, సాంబశివరావు, రాజు, వసంత్‌కుమార్, వేణు, శ్రావణ్‌కుమార్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.