
ఉద్యమం ఉధృతం
దశలవారీగా ఆందోళనలు సమస్యల పరిష్కారమే లక్ష్యం సింగరేణి అధికారుల సంఘం నిరసనలు మాస్ క్యాజువల్ లీవ్ లేదా ఒకరోజు సమ్మెకు యోచన
గోదావరిఖని: సింగరేణి అధికారుల సంఘం నాయకులు సమస్యల పరిష్కారం, హక్కుల సాధనకు ఉద్యమం ఉధృతం చేశారు. నాలుగు రోజులుగా నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న సింగరేణి కోల్‌మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ (సీఎంవోఏఐ) ప్రతినిధులు.. త్వరలోనే వర్క్ టూ రూల్, ఒక రోజు సమ్మె చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తు న్నారు. ఈనెల 17న భూపాలపల్లిలో సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. పెర్ఫార్మెన్స్ రిలేటెడ్‌పే(పీఆర్పీ) కోసం పట్టుపడుతున్నారు. గత ఆ ర్థిక సంవత్సరంతోపాటు పదేళ్లనాటి పీఆర్పీ బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు. వీటితోపాటు వివిధ సమస్యలపై సింగరేణి సీఎండీ, డైరెక్టర్లతో ప లుదఫాలు సమావేశమైనా స్పష్టత రాలేదు. దీంతో నిరాశ, నిస్పృహలతో విధులు నిర్వర్తిస్తున్నారు.
ఇంకా అందని బకాయిలు
పీఆర్పీ బకాయిల కోసం రిటైర్డ్ అధికారులు ఎదురుచూస్తున్నారు. ఇవి చేతికి రాకుండానే చాలామంది ఉద్యోగ విరమణ చేశారు. వీరిలో కొందరు కో ర్టుకు వెళ్తే అనుకూల తీర్పు వచ్చినట్లు నాయకులు చెబుతున్నారు. అయినా.. బకాయిలు చెల్లించేందుకు సింగరేణి యాజమాన్యం ముందుకు రావడం లేదనే అసంతృప్తితో ఉన్నారు.
ప్రధాన డిమాండ్‌లు ఇవే..

ఉద్యమం ఉధృతం