న్యూస్‌రీల్
పత్తిపాక రిజర్వాయర్ డీపీఆర్ కోసం నిధులు జిల్లాలో కొత్తగా 12,168 రేషన్‌కార్డులు జారీ రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఒబెదుల్లా కొత్వాల్ సాహెబ్ కలెక్టరేట్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం హాజరైన పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్
ఠాకూర్‌కు సీఎం శుభాకాంక్షలు
గోదావరిఖని: రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం పు ట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవ లో నిమగ్నమై, ప్రజాపాలనలో భాగస్వాము లు కావడానికి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సీఎం ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గంలోని పలుచోట్ల అన్నదానం, రక్తదానం తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
విద్యార్థులకు ఉపకారవేతనాలు
గోదావరిఖనిటౌన్: జనగామ జెడ్పీ హైస్కూల్ లో కెనరా బ్యాంక్ తిరుమలనగర్ శాఖ విద్యార్థులకు బ్యాంకు ఖాతాలు ప్రారంభించింది. వి ఠల్‌నగర్, ఎలుకలపల్లి, జనగామ ప్రభుత్వ పా ఠశాలల్లో చదువుకుంటూ ప్రథమ స్థానంలో ని లిచిన 5, 6, 7వ తరతగతి బాలికలకు ప్రోత్సాహకంగా రూ.3 వేలు, 8, 9, 10 తరగతుల వి ద్యార్థినులకు రూ.5వేల చొప్పున స్కాలర్‌షిప్స్ డిపాజిట్ చేసి పాస్‌పుస్తకాలు అందజేశారు. బ్యాంక్ మేనేజర్ అజిత్, ప్రధానోపాధ్యాయురాలు జ్యోష్ణలత, ఉపాధ్యాయులు ఉన్నారు.
ఒకే భవనం.. మూడు జెండాలు
జూలపల్లి(పెద్దపల్లి): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్థానిక సహకార సంఘ భవనం ఎదుట మూడు జాతీయ జెండాలను ఒకేసారి ఆవిష్కరించారు. సహకార సంఘ భవనంలో వ్యవసాయ, శాఖ గ్రంథాలయం, ప్యాక్స్ కా ర్యాలయాలు ఉన్నాయి. దీంతో ఏటా ఒకేసారి మూడు జాతీయ జెండాలు ఎగురవేయడం ఆనవాయితీగా వస్తోంది. ఏవో ప్రత్యూష లైబ్రేరియన్ మౌళి, ప్యాక్స్ చైర్మన్ కొంజెర్ల వెంకటయ్య త్రివర్ణ పతాకాలు ఆవిష్కరించారు.
అందుబాటులో యూరియా
పెద్దపల్లిరూరల్: రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని, ఎరువుల కోసం ఆందోళన వద్దని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం యూరియా పంపిణీపై వ్యవసాయాధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అవసరాల కన్నా ఎక్కువ నిల్వ చే సుకోవద్దని సూచించారు. కొందరు డీలర్లు సై తం ఎరువుల విక్రయాల్లో అవకతవకలకు పా ల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని, వాస్తవమమని తేలితే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. డీఏవో శ్రీనిఆవస్, ఏడీఏ కాంతారావు, అంజనీతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఎల్కలపల్లికి ఆర్టీసీ బస్సు
ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): పాలకుర్తి మండ లం ఎల్కలపల్లికి పల్లెవెలుగు ఆర్టీసీ బస్సును ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ శుక్రవారం ప్రా రంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరిఖని నుంచి ఎఫ్‌సీఐ ఎల్కలపల్లి గేట్ మీదు గా గుంటూరుపల్లి, ఎల్కలపల్లి గ్రామాలను క లుపుతూ సబ్బితం నుంచి పెద్దపల్లి వరకు బ స్సు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ప్రజలు స ద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మ నాలీ ఠాకూర్, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న ఒబెదుల్లా కొత్వాల్ సాహెబ్
మహిళా పోలీసు బలగాల కవాతు
సంక్షేమం, అభివృద్ధే ధ్యేయం
సాక్షి, పెద్దపల్లి: ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పాలన సాగిస్తున్నామని రాష్ట్ర మైనారిటీస్ ఫైనా న్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఒబెదుల్లా కొ త్వాల్ సాహెబ్ అన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని పరేడ్ గ్రౌండ్స్‌లో శుక్రవారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవానికి ఒబెదుల్లా కోత్వాల్ సాహెబ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత ఆయన పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి మాట్లాడారు.
మహిళలకు అండగా..
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లోఉచిత ప్రయాణ సౌకర్యం కల్పి స్తున్నామని, దీనిద్వారా జిల్లాలో ఇప్పటివరకు రూ.155.80 కోట్ల వరకు ఆదా అయిందని కొత్వాల్ సాహెబ్ అన్నారు. రూ.500కే వంటగ్యాస్ సిలిండర్‌ను ప్రభుత్వం అందిస్తోందని, దీనిద్వారా ఇప్పటి వరకు 1,18,397 కుటుంబాలకు రాయితీగా వారి బ్యాంక్ ఖాతాల్లో రూ.14.3 కోట్లు జమచేశామ న్నారు. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తున్న వారికి రూ. 85.24 కోట్లు చెల్లించి 1,31,966 కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేశామని ఆయన తెలిపారు.
సొంతింటి కల నెరవేరేలా..
పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశ పెట్టిందని, జిల్లాలో తొలివిడతలో ఇప్పటివరకు 6244 ఇళ్లు మంజూరు చేసి రూ.19.52కోట్లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని కొత్వాల్ సాహెబ్ అన్నారు. ఉగాది పండుగనాడు సన్నబియ్యం పంపిణీని ప్రారంభించించామని, కొత్తగా 12,168 కుటుంబాలకు రేషన్‌కార్డులు అందజేశామని ఆయన వివరించారు. రైతులకు పెట్టుబడి సహాయాన్ని రూ.12 వేలకు పెంచి వానాకాలం పంటల కోసం 1,51,507 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.161.2 కోట్ల భరోసా నిధులు జమచేస్తామని ఆయన వివరించారు.
చివరి ఆయకట్టు రైతులకు భరోసా..
కాకతీయకాలువ కింద సుమారు 2.30 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, 10 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు శ్రీలక్ష్మీనరసింహస్వామి పత్తిపాక రిజర్వాయర్ నీటి నిల్వ సా మర్థ్యాన్ని 3 టీఎంసీల నుంచి 5 టీఎంసీలకు పెంచామని, దీని డీపీఆర్ తయారీ కోసం రూ.1.10 కోట్లు మంజూరు చేశామని ఆయన తెలిపారు. దీంతోపాటు 13,396 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు రామగుండం ఎత్తిపోతల పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికను పూర్తిచేసి ఇటీవల ప్రారంభించామని ఆయన గుర్తుచేశారు.
చిల్లపల్లి గ్రామానికి అవార్డు
మంథని మండలం చిల్లపల్లి గ్రామ పంచాయతీకి ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ కేటగిరీలో దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారం లభించిందని ఒబెదుల్లా అన్నారు. పట్టణ ప్రాంతాల్లో రూ.173 కోట్లు ఖర్చు చేస్తూ సీసీ రోడ్లు, సీసీ డ్రెయినేజీలు, బీటీ రోడ్లు, శ్మశానవాటికలు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, పురపాలక భవనం, డంప్‌యార్డ్ వంటి పనులు చేపట్టామని తెలిపారు. అమృత పథకం 2.0 కింద రూ.293.84కోట్లతో ఫీవర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లు నిర్మిస్తున్నామని అన్నారు.
ప్రతిభావంతులకు పురస్కారాలు
విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన 203 మంది ఉద్యోగులకు కొత్వాల్ సాహెబ్ ప్రశంసాపత్రాలు పంపిణీ చేశారు. పదో తరగతి, ఇంటర్‌లో టాపర్లుగా నిలిచిన నలుగురు విద్యార్థులకు రూ.10వేల చొప్పున ప్రోత్సాహకం అందించారు. మెప్మా కింద 148 స్వయం సహాయక సహాయ మహిళా సంఘాలకు రూ.17,36,98,000 బ్యాంకు లింకేజీ రుణాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, వేణు, డీసీపీ కరుణాకర్, ఆర్‌డీవో గంగయ్య, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
జెండాకు వందనం చేస్తున్న ప్రతినిధులు
శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025
శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025
శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025
శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025
శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025
శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025
శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025
శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025
శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025
శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025
శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025
శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025